12మంది సిబ్బందిపై ఎన్నికల కమిషన్ క్రమశిక్షణ చర్యలు

Update: 2019-05-04 14:52 GMT

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన 12మంది సిబ్బందిపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. విశాఖపట్నం ఆర్వో, ఏఆర్వో... తూర్పుగోదావరి జిల్లా మండపేట ఆర్వో, ఏఆర్వో.. నెల్లూరు జిల్లా కోవూరు ఆర్వో, ఏఆర్వో... సూళ్లూరుపేట ఆర్వో, ఏఆర్వో... నూజివీడు ఆర్వో, ఏఆర్వోలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్వో, ఏఆర్వోలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు అభియోగాల నమోదుతో పాటు.. శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. మరికొందరు అధికారులపై ఈసీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అటు.. రీ పోలింగ్ ముగిసే వరకు నిరుద్యోగ భృతి పెంచేందుకు ఈసీ అనుమతి నిరాకరించింది. కొత్త లబ్ధిదారుల నమోదు లేకుండా ఆదరణ పథకం కొనసాగింపునకు ఆమోదం తెలిపింది.

Similar News