పోలవరం ప్రాజెక్ట్‌కు తెలంగాణ అడ్డుకాదు : తెలంగాణ
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తెలంగాణ అడ్డుకాదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. అయితే తెలంగాణలో ముంపు గ్రామాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రం, ఏపీలపై ఉందని లేఖలో పేర్కొంది. అలాగే పోలవరం బ్యాక్‌వాటర్‌తో తెలంగాణకు వచ్చే సమస్యలను కూడా పరిగణలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
Next Story




