Sushant Death Case: సుశాంత్‌ సూసైడ్‌ కేసులో కీలక పరిణామం

Sushant Death Case: సుశాంత్‌ సూసైడ్‌ కేసులో కీలక పరిణామం
x
Highlights

Sushant death case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ మృతి కేసులో సీబీఐ...

Sushant death case: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని బీహార్ కోరింది. ఇవాళ సుశాంత్ తండ్రి కృష్ణ కుమార్‌.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌ను క‌లిశారు. సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణ చేప‌ట్టాల‌ని కేకేసింగ్ బీహార్ సీఎంను కోరిన‌ట్లు తెలిసింది. సుశాంత్ మృతి కేసును సీబీఐకి అప్ప‌గించాల‌ని కేంద్రానికి ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లు జేడీయూ ప్ర‌తినిధి సంజ‌య్ సింగ్ తెలిపారు.

కుటుంబ‌స‌భ్యులు కోరిన నేప‌థ్యంలో సుశాంత్ మృతి కేసులో సీబీఐ విచార‌ణకు సిఫార‌సు ప్ర‌తిపాద‌న చేస్తున్న‌ట్లు ఓ మీడియాతో సీఎం నితీశ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది జూన్ 14వ తేదీ నుండి సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకి ఇచ్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఈ కేసు దర్యాప్తును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.Show Full Article
Print Article
Next Story
More Stories