Sushant Singh Rajput Had Googled : సూసైడ్‌ కి ముందు సుశాంత్‌ గూగుల్ లో ఇదే సెర్చ్ చేశాడట!

Sushant Singh Rajput Had Googled : సూసైడ్‌ కి ముందు సుశాంత్‌ గూగుల్ లో ఇదే సెర్చ్ చేశాడట!
x
Sushant Singh Rajput (File Photo)
Highlights

Sushant Singh Rajput Had Googled : బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Sushant Singh Rajput Had Googled : బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో పలు సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ సింగ్ ది ఆత్మహత్య కాదని, హత్య అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముంబై పోలీసులు కూడా ఈ కేసు పైన బాగానే ఫోకస్ పెట్టారు. అయితే సుశాంత్ చనిపోయే ముందు స్వయంగా తన పేరును పలుమార్లు గూగుల్ లో సెర్చ్ చేసినట్టుగా ముంబై పోలీసులు తాజాగా వెల్లడించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన వివ‌రాల‌ను సోమవారం ముంబై పోలీసు క‌మిష‌న‌ర్ ప‌ర‌మ్‌ బీర్ సింగ్ మీడియాకి వెల్లడించారు.

తాజాగా సుశాంత్ ఫోన్ ను అన్ లాక్ చేశారు ఫోరెన్సిక్ నిపుణులు.. అందులో సుశాంత్ రాజ్ పూత్ డేటాని క్షుణ్ణంగా పరిశీలించారు. మరణానికి కొన్ని నిమిషాల ముందు సుశాంత్ గూగుల్ లో నొప్పి లేకుండా చనిపోవడం ఎలా? అని సెర్చ్ చేసినట్లుగా ఫోరెన్సిక్ అధికారులు వెల్లడించారు. అప్పుడు మాత్రమే కాకుండా అంతకుముందు కూడా సుశాంత్ చాలా సార్లు గూగుల్ లో తన పేరుతో సెర్చ్ చేసుకునే వాడని వెల్లడించారు.

తన మాజీ మేనేజర్ దిషా సాలియ‌న్ ఆత్మహత్యకు, తనకు లింక్‌ ఉందని మీడియాలో వచ్చిన కథనాలను సుశాంత్‌ చదివేవాడని కమిషనర్‌ పరమ్‌ బీర్‌ సింగ్‌ వెల్లడించారు. దీనివలన అత‌ను చాలా మాన‌సికంగా కృంగిపోయిన‌ట్లుగా అయన వెల్లడించారు. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి కొన్ని నెలల ముందు బైపోలార్ డిజార్డర్ తో ఇబ్బంది పడుతున్నాడని, దీనికోసం మందులు తీసుకుంటున్నాడని, ఈ విషయాన్ని అతని వైద్యుల నుండి బయటపడిందని ముంబై పోలీసులు వెల్లడించారు.

ఇక అటు సుశాంత్‌ సింగ్ రాజ్ పుత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పైన సుశాంత్‌ తండ్రి కేకే సింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే.. ఆర్ధికంగా రియా చక్రవర్తి సుశాంత్‌ ని వాడుకుందని, అంతేకాకుండా మానసిక క్షోభకు కూడా గురి చేసిందని అయన ఆరోపిస్తూ బీహార్ లోని పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పాట్నా పోలీసులు రియా చక్రవర్తి పైన పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్టుగా వెల్లడించారు. ప్రస్తుతం దీనిపైన దర్యాప్తు జరుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories