Top
logo

లంగ్ క్యాన్సర్..చప్పుడులేకుండా చుట్టేస్తుంది!

లంగ్ క్యాన్సర్..చప్పుడులేకుండా చుట్టేస్తుంది!
Highlights

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏటా లక్షలాది మందిని చంపేస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ తరువాత ఎక్కువగా ఈ క్యాన్సరే...

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఏటా లక్షలాది మందిని చంపేస్తోంది. బ్రెస్ట్ క్యాన్సర్ తరువాత ఎక్కువగా ఈ క్యాన్సరే ప్రాణాంతకం గా చెప్పొచ్చు. దీనితో వచ్చే చిక్కేమిటంటే.. ఇది వచ్చినట్టు త్వరగా తెలీదు. తెలిసిన తరువాత చేయడానికేమీ మిగలదు. చాలా సైలెంట్ గా లాంగ్ క్యాన్సర్ చుట్టేస్తుంది. లక్షణాలను బాగా ముదిరితేనే కానీ గుర్తించలేము. ఈరోజు (ఆగస్ట్ 1) ప్రపంచ లాంగ్ క్యాన్సర్ డే! ఈ సందర్భంగా ఊపిరితిత్తులకు వచ్చే ఈ సైలెంట్ కిల్లర్ గురించి అవగాహన కోసం...

ఎందుకు వస్తుంది?

సాధారణంగా ఏ వ్యాధి రావదానికైనా కారణం ఈ చెడు అలవాటే అని చెప్పగలుగుతారు. అంటే.. ఉదాహరణకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల లివర్ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువని అంటారు. కానీ, ఊపిరి తిత్తులకు వచ్చే క్యాన్సర్ కచ్చితంగా ఈ చెడ్డ అలవాటు వల్లే వస్తుందని అనుకోవడానికి లేదు. ఏ రకమైన చెడు అలవాట్లూ లేకపోయినా వచ్చే అవకాశం ఉన్న వ్యాధి ఇది. ఎక్కువగా పోగాతాగేవారికి ఇది వస్తుందని చెప్పినప్పటికీ.. పొగతాగని వారిలో కూడా ఈ వ్యాధి ఎక్కువగానే వస్తుండడం గమనార్హం.

ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు అనేక అంశాలు దోహదపడతాయి. మన దేశంలో 90 శాతం కేసుల్లో క్యాన్సర్ వ్యాప్తికి పొగాకు వాడకమే ప్రధాన కారణం. సాధారణ వ్యక్తితో పోలిస్తే పొగతాగేవారిలో ఈ వ్యాధి రావడానికి అవకాశాలు 2.5 రెట్లు ఎక్కువ. అయితే పొగతాగడం అలవాటు లేని ఊపిరితిత్తుల క్యాన్సర్ పేషెంట్లలో 65 శాతం మహిళలు కాగా... కేవలం 35 శాతం మంది మాత్రమే పురుషులున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటున్న వివరాల మేరకు వాతావరణ కాలుష్యం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ప్రధాన కారణం.

ఎలా తెలుసుకోవచ్చు..

ఊపిరితిత్తుల వ్యద్దిని త్వరగా గుర్తించే అవకాశం ఎందుకు ఉండదంటే.. ఈ వ్యాధి లక్షణాలు సాధారణ వ్యాధుల లక్షణాలుగానే మొదట కనిపిస్తాయి. ఒక్కోసారి అవి వేరే రకమైన వ్యాధి లక్షణాలే అన్నట్టుగా అనిపిస్తాయి. దగ్గు.. శ్వాస ఆడకపోవడం, గొంతు బొంగురు పోవడం, వెన్ను నొప్పి ఇలా.. ఈ లక్షణాల్లో ఏవైనా రెండు తరచూ వస్తున్నా.. వీడకుండా దీర్ఘకాలంగా ఉంటున్నా అవి ఊపిరితిత్తుల సమస్యగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి.

లంగ్ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడానికి అవకాశం ఉండదు. అయితే కొన్ని రకాల లక్షణాలు క్యాన్సర్ కు ముందస్తు హెచ్చరికగా గుర్తించే వీలుంటుంది.

వీడని దగ్గు.. సాధారణంగా దగ్గు ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతుంది. కానీ, ఒక్కోసారి మందులు వాడితేనే 2 నుంచి 3 వారాలలో తగ్గుతుంది. అలా కాకుండా నెల కన్నా ఎక్కువ రోజులు దగ్గు వీడకుండా ఉంటె.. లేదా తరచుగా దగ్గు వస్తూ పోతూ వుంటే దానిని అశ్రద్ధ చేయకూడని సంకేతంగా గుర్తించాలి.

శ్వాసలో ఇబ్బందులు..గురక.. లంగ్ క్యాన్సర్ సోకిన వారి శ్వాసలో మార్పులు గుర్తిన్చాతగ్గవిగా ఉంటాయి. తరచూ శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందులు తలెత్తడం, నిద్రలో గురక ఎక్కువ రావడం వంటివి లాంటివి లంగ్ క్యాన్సర్ గా అనుమానించవచ్చు.

గొంతు పూడుకుపోయినట్టుగా ఉండడం.. గొంతు పూడుకుపోయినట్టుగా చాలా కాలం ఉంటె దానిని కూడా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యగా భావించవచ్చు.

బరువు ఒక్కసారిగా తగ్గిపోవడం.. శరీర బరువులో అకస్మాత్తుగా మార్పు రావడం కూడా ఊపిరితిత్తులకు ఇబ్బంది వచ్చిందని అనుకోవచ్చు.

వెన్నునొప్పి.. ఇదే ఊపిరితిత్తుల క్యాన్సర్ తెలిపే ముఖ్య లక్షణంగా వైద్యులు చెబుతారు. ఎముకలు.. కీళ్లలో నొప్పులు, నడుము భాగంలో విపరీతమైన నొప్పి ఉండి, ప్రత్యేకంగా రాత్రి వేళల్లో ఎక్కువగా అవుతుంటే అది ప్రమాదకరమని.. క్యాన్సర్ కు సంకేతమని గుర్తించాలని వారు చెబుతున్నారు.

ఏం చేయాలి?

పొగతాగే అలవాటు ఉన్నవారు వెంటనే పొగతాగడం మానేయాలి. పొగ తాగటం మానేసిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.

అదేవిధంగా పొగతాగే వారి పక్కన ఉండడం కూడా ముప్పును తెస్తుంది. పోగాతాగేవారి వద్ద ఉండకుండా జాగ్రత పడాలి.

శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తినప్పుడు స్వంత వైద్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించటం అవసరం.

పైన చెప్పిన వ్యాధి లక్షణాల్లో ఏ రెండు లక్షణాలు గుర్తించినా వెంటనే వైద్యపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి


Next Story