Tanuku: తణుకులో మూడో రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

Tanuku: తణుకులో మెగా డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ రిలే దీక్షలు మూడో రోజుకు చేరాయి. ఈ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని నేతలు డిమాండ్ చేశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 8 Aug 2026 1:19 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో మూడో రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

డీఎస్సీ స్కాంపై తణుకులో మూడో రోజుకు చేరిన వైఎస్సార్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

మెగా డీఎస్సీ–2025 ఉపాధ్యాయ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తణుకు కోర్టు వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజుకు చేరాయి. మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకు కొనసాగుతున్న ఈ దీక్షల్లో నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్ గూడూరి ఉమాబాల పాల్గొని మాట్లాడారు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీల అమలులో జాప్యం చేస్తోందని ఉమాబాల విమర్శించారు. ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అంటూ గత ఎన్నికల్లో హామీ ఇచ్చి నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. డీఎస్సీ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత విషయంలోనూ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. మహిళల రక్షణకు గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దిశా పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, దిశా చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తణుకు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ నాయకులు, తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాలకు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు...

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story