Tanuku: కార్యకర్తలే పార్టీకి వెన్నెముక..వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ!

Tanuku: తణుకు లయన్స్ క్లబ్‌లో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ. ముదునూరి ప్రసాదరాజు, వంక రవీంద్రనాథ్, కొట్టు నాగు తదితర నేతలు హాజరు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 10 Sept 2026 10:56 AM IST
Tanuku
X

Tanuku: కార్యకర్తలే పార్టీకి వెన్నెముక..వైఎస్సార్‌సీపీ ఐడీ కార్డుల పంపిణీ!

Tanuku: మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమం తణుకు లయన్స్‌ క్లబ్‌లో బుధవారం నిర్వహించారు. తొలుత మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్బంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీలో ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ కార్డులు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. తణుకు నియోజకవర్గంలో సుమారు 6 వేల కార్డులు ఇస్తున్నామని, కార్యకర్తకు మొదటి ప్రాధాన్యతగా గుర్తింపు కార్డు ఇస్తున్నామని ఇదొక గౌరవంగా భావించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి ముదునూరి మురళీకృష్ణంరాజు మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే అండగా ఉంటారని అటువంటి కార్యకర్తకు పెద్దపీటవేయాలనే ఉద్దేశ్యంతో ప్రతి కార్యకర్తకు ఇకపై ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్‌ మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తను గుర్తించే కార్యక్రమంలో భాగంగానే ఐడీ కార్డులను అందిస్తున్నారని అన్నారు.

రానున్న రోజుల్లో పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతుందని స్పష్టం చేశారు. నరసాపురం పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రత్యేక గుర్తింపు ఇచ్చేందుకు ఐడీ కార్డులు అందిస్తున్నామని, కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని కోరారు. తణుకు నియోజకవర్గ పరిశీలకులు కొట్టు నాగు మాట్లాడుతూ పార్టీ ఐడీ కార్డుతో కార్యకర్తలకు ఒక గౌరవం, భద్రత కల్పించిందని అన్నారు.

తండ్రీ కొడుకుల అక్రమ అరెస్టు...

కూటమి ప్రభుత్వ అసమర్థ పాలనను ధైర్యంగా ఎదుర్కొంటున్నారనే ఉద్ధ్యేంతో కక్షగట్టి తన భర్త, మాజీ మంత్రి వెంకట నాగేశ్వరరావు, కుమారుడు సునీల్‌కుమార్‌లను అక్రమ అరెస్టు చేసి జైలులో ఉంచారని కారుమూరి సతీమణి లక్ష్మీకిరణ్, సునీల్‌కుమార్‌ సతీమణి కీర్తి ఆవేదన వ్యక్తం చేశారు.

గత 3 నెలలుగా మా కుటుంబం తీవ్ర క్షోభను అనుభవిస్తుందని కళ్లనీళ్లపర్యంతమయ్యారు. అయినప్పటికీ మేము బెదరబోమని, పార్టీ నాయకులు, కార్యకర్తలు చూపించిన ప్రేమాభిమానాలతో ధైర్యంగా ఉన్నామని చెప్పారు. కారుమూరి రాజకీయంలో ఉన్నప్పటి నుంచి కుటుంబం కంటే పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతోనే అధిక సమయం గడిపారని నేను అందరివాడిని అంటూనే ఉన్నారని గుర్తుచేశారు.

బలహీన వర్గం నుంచి బలమైన నాయకుడిగా కారుమూరి...

బలహీన వర్గం నుంచి వచ్చి బలమైన నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును రాజకీయంగా ఎదుర్కొనలేక అక్రమ కేసులో ఇరికించి జైలుపాలు చేశారని అయినప్పటికీ ఆయన బెదరలేదని పార్టీ నేతలు అన్నారు. రెండేళ్లుగా కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ధైర్యంగా ఎండగట్టినందుకు కారుమూరి కుటుంబంపై కక్షకట్టి మహిళలను కూడా ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు.

కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పంచాయితీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, లీగల్‌సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, తణుకు, అత్తిలి, ఇరగవరం మండల అధ్యక్షులు పెనుమర్తి వెంకటరామన్న, పైబోయిన సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, ఎంపీపీ రుద్రా ధనరాజు, పెనుమత్స సుబ్బరాజు, చోడే గోపికృష్ణ, పెనుమత్స రామరాజు, పొట్ల సురేష్, సబ్బితి రాజేష్, మెహర్‌ అన్సారీ, నూకల కనకదుర్గ, పెనుమాల రాజేష్, జంగం ఆనంద్‌కుమార్, కలిశెట్టి ప్రకాష్, కొత్తపల్లి చరణ్, ఉండవల్లి జానకి తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story