Tanuku: న్యాయవాది వృత్తి రక్షణ చట్టం చేయాలని తణుకులో లాయర్ల ధర్నా!
Tanuku: తణుకులో న్యాయవాది వృత్తి రక్షణ చట్టం కోరుతూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో న్యాయవాదుల ధర్నా రెండో రోజుకు చేరింది. ఏపీ ప్రభుత్వం చట్టం చేయాలి.
Tanuku: న్యాయవాది వృత్తి రక్షణ చట్టం చేయాలని తణుకులో లాయర్ల ధర్నా!
Tanuku: న్యాయవాది వృత్తి రక్షణ చట్టం కొరకు న్యాయవాదులు ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కామన మునిస్వామి అన్నారు. న్యాయవాదులు కోర్టు విధులను బహిష్కరించి చేపట్టిన ధర్నా బుధవారం నాటికి రెండో రోజుకి చేరింది.
అనంతరం డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వేల సంఖ్యలో న్యాయవాదులు ఉన్నారని వారికి సరైన రక్షణ కర వైనదన్నారు. న్యాయవాదుల రక్షణకు ఇప్పటికే తెలంగాణ , కర్ణాటక రాష్ట్రాల్లో చట్టం అమలు జరుపుతున్నారని, ఆంధ్రప్రదేశ్ లో కూడా న్యాయవాద వృత్తికి రక్షణ చట్టాన్ని చేయాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయవాదుల వృత్తి రక్షణకు చట్టం చేయాలని లేని పక్షంలో ఐక్య పోరాటాలుగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడు కౌరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు జి .అంబేద్కర్, బి.బి.వి. విక్టర్ బాబు, చింతపల్లి నాగేశ్వరరావు పొట్ల శ్రీనివాసులు, పి .విగ్నేశ్వర రావు, పి .లక్ష్మీనారాయణ




