Tanuku: ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడిగా పండన్న, కార్యదర్శిగా క్రీస్తుదాసు
Tanuku: ఏఐసీసీ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడిగా కాకర్ల రాజేంద్రప్రసాద్ (పండన్న), కార్యదర్శిగా క్రీస్తుదాసు నియామకం. విజయవాడలో ఆర్డర్ పత్రాలు అందజేత.
Tanuku: ఏఐసీసీ జిల్లా అధ్యక్షుడిగా పండన్న, కార్యదర్శిగా క్రీస్తుదాసు
తణుకు: అసోసియేషన్ ఆఫ్ ఇంటిగ్రిటీ క్రిస్టియన్ కౌన్సిల్ (ఏఐసీసీ) పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా తణుకు పట్టణానికి చెందిన రెవరెండ్ కాకర్ల రాజేంద్రప్రసాద్ (పండన్న), క్రీస్తుదాసులను నియమించినట్లు తెలిపారు. విజయవాడలో బుధవారం నిర్వహించిన ఏఐసీసీ జాతీయస్థాయి కోర్ కమిటీ సమావేశంలో అంతర్జాతీయ అధ్యక్షుడు గేరాహానోకు నుంచి నియామక పత్రం అందుకున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి ఏఐసీసీ ప్రతినిధులు పాల్గొని క్రైస్తవ సమస్యలపై సూచనలు, సలహాలు, విభిన్న అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా
కాకర్ల పండన్న మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైన ఏఐసీసీ ముందుండి పోరాడటమే కాకుండా, సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. సేవకులకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా, సమాజ గౌరవాన్ని నిలబెట్టి ప్రతి మండలంలో ఏఐసీసీ కమిటీలను ఏర్పాటు చేసి క్రైస్తవ ఐక్యతకు పాటుపడతామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు పాల్గొన్నారు




