Razole: 'ఛలో విజయవాడ'.. కోనసీమ నుంచి తరలివెళ్లనున్న సీపీఐ శ్రేణులు!

Razole: రైతులు, కౌలు రైతుల సమస్యలపై సీపీఐ పిలుపునిచ్చిన 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుండి భారీగా తరలివెళ్లనున్నారు.

PRABHU, RAZOLE
Published on: 29 Jun 2026 11:36 AM IST
Razole
X

Razole: 'ఛలో విజయవాడ'.. కోనసీమ నుంచి తరలివెళ్లనున్న సీపీఐ శ్రేణులు!

రాజోలు : రైతులు, కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం సీపీఐ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నిర్వహించనున్న 'ఛలో విజయవాడ' కార్యక్రమానికి డాక్టర్.బీఆర్ .అంబేడ్కర్ కోనసీమ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు, రైతులు తరలివెళ్లనున్నారు.

జిల్లా సీపీఐ కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు అధిక సంఖ్యలో విజయవాడకు బయలుదేరనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కౌలు రైతులకు చట్టబద్ధమైన గుర్తింపు కల్పించాలని, వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటించాలని, ఇన్‌పుట్ సబ్సిడీని పెంచాలని, రైతులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రైతులు, కౌలు రైతులు వేలాదిమందిగా హాజరై 'ఛలో విజయవాడ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

PRABHU, RAZOLE

PRABHU, RAZOLE

Next Story