Velerupadu: వేలేరుపాడు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
Velerupadu: ఏలూరు జిల్లా వేలేరుపాడులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కూటమి నాయకులు. ఎమ్మెల్యే బాలరాజు కృషిని కొనియాడిన లబ్ధిదారులు.
Velerupadu: వేలేరుపాడు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వేలేరుపాడు: అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) పోలవరం ఎమ్మెల్యే చెర్రీ బాలరాజు ఆదేశాల మేరకు కూటమి నాయకులు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు.
ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని భూదేవిపేట గ్రామంలో జనసేన మండల ప్రధాన కార్యదర్శి మేచినేని సంజయ్, టిడిపి మండల అధ్యక్షులు అమరవరపు అశోక్, బిజెపి మండల అధ్యక్షులు ఓలేటి అనిల్ (బాలకృష్ణ) ల చేతుల మీదుగా లబ్దిదారులైన లాడే వెంకటేశ్వర్లు, బొడ్డు శివ సాయి లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఆసరాగా ఉపయోగపడుతుందని అన్నారు. సీఎం రిలీఫ్ చెక్కులను అందుకున్న లబ్దిదారులు మాట్లాడుతూ తమకు సహాయం అందించిన కూటమి ప్రభుత్వానికి,
అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ సాయం అందేలా కృషి చేసిన ఎమ్మెల్యే చిర్రి.బాలరాజుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో జనసేన నాయకులు బి, శివరామ్ ప్రసాద్, ఎస్. వంశీ, కే భాను, టీడీపీ నాయకులు కే ముత్యాలరావు, పి లక్ష్మయ్య, జి, అనిల్, బి గంగాధర్ రావు, పి చిన్ని, సత్తిపండు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.




