Bhimavaram: బ్రిక్స్ సదస్సుకు విచ్చేసిన బురుండి అధ్యక్షునికి ఘన స్వాగతం

Bhimavaram: న్యూఢిల్లీలో 18వ బ్రిక్స్ సదస్సు. ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్, బురుండి అధ్యక్షుడు ఎవరిస్ట్ న్దాయిషిమియేకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 12 Sept 2026 6:09 PM IST
Bhimavaram
X

Bhimavaram: బ్రిక్స్ సదస్సుకు విచ్చేసిన బురుండి అధ్యక్షునికి ఘన స్వాగతం

భీమవరం: న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12, 2026 న్యూఢిల్లీలో ఎంతోప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) తరఫున హాజరైన ఆఫ్రికన్ యూనియన్ ఛైర్‌పర్సన్ బురుండి రిపబ్లిక్ అధ్యక్షుడు ఎవరిస్ట్ న్దాయిషిమియేకు కేంద్ర భారీ పరిశ్రమలు మరియు ఉక్కు శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ భారత ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా విదేశాంగ మంత్రిత్వ శాఖ 'ఎక్స్' వేదికపై స్పందిస్తూ, 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్‌కు ప్రాతినిధ్యం వహించడానికి న్యూఢిల్లీ చేరుకున్న బురుండి అధ్యక్షుడు ఎవరిస్ట్ న్దాయిషిమియేకు కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సాదర స్వాగతం పలికారని తెలిపింది. గ్లోబల్ సౌత్ ఉమ్మడి ప్రాధాన్యతల సాధనలో భారతదేశం, ఆఫ్రికన్ యూనియన్ లోతైన భాగస్వామ్యంతో కలిసి పనిచేస్తున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM