Ungutur: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పాతూరు వద్ద రోడ్డు స్టాపర్ల ఆవిష్కరణ!
Ungutur: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో, ఎమ్మెల్యే ధర్మరాజు సూచన మేరకు పాతూరు వద్ద ప్రమాదాల నివారణకు భీమడోలు పోలీసుల ఆధ్వర్యంలో 20 రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేశారు.
Ungutur: పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పాతూరు వద్ద రోడ్డు స్టాపర్ల ఆవిష్కరణ!
Ungutur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో వారి సామాజిక బాధ్యతను స్ఫూర్తిగా తీసుకొని, ఉంగుటూరు శాసనసభ్యులు శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి సూచనల మేరకు పాతూరు వద్ద రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేశారు.
జాతీయ రహదారిపై వాహనాల వేగాన్ని నియంత్రించి, రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో భీమడోలు పోలీసుల పర్యవేక్షణలో పాతూరు వద్ద 20 రోడ్డు స్టాపర్లను బుధవారం ఏర్పాటు చేశారు. స్థానిక కూటమి నాయకులు, నాగహనుమాన్ ఫ్యాక్టరీ సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా భీమడోలు ఎస్‌ఐ ఎస్.కె. మదీనాబాషా మాట్లాడుతూ.. రద్దీగా ఉండే ప్రాంతాల్లో వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు రోడ్డు స్టాపర్లు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ, నిర్దేశిత వేగంతో ప్రయాణించాలని సూచించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, రోడ్డు ప్రమాదాల నివారణకు స్థానికుల సహకారంతో మరిన్ని చర్యలు చేపడతామని అన్నారు.
కూటమి నాయకులు వెజ్జు రాంబాబు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో, ఎమ్మెల్యే శ్రీ పత్సమట్ల ధర్మరాజు గారి సూచనలు, భీమడోలు పోలీసుల సహకారంతో రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాగహనుమాన్ పరిశ్రమ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాగహనుమాన్ ఫ్యాక్టరీ ఏజీఎం నాగేశ్వరరావు, జనసేన నాయకులు వెజ్జు రాంబాబు,నిమ్మల బాలాజీ,వెజ్జు ధర్మారావు,వెజ్జు నాగేశ్వరరావు, కలపల్లి నాని, మామిళ్ళపల్లి నాగభూషణం, వెజ్జు సూరిబాబు, బాలకృష్ణ, గ్రామపెద్దలు, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.




