Tanuku: రాధారంగా మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శిగా తులా భాస్కర్ నియామకం!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన తులా భాస్కర్ రాధారంగా మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు.
Tanuku: రాధారంగా మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శిగా తులా భాస్కర్ నియామకం!
తణుకు: రాధారంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర కార్యదర్శిగా తణుకు కు చెందిన తులా భాస్కర్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో బుధవారం నిర్వహించిన ఆంధ్ర–తెలంగాణ రాధా రంగా మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు కాళ్లపాలెం బుజ్జి నుంచి నియామక పత్రాన్ని అందుకున్నారు.
ఈ సందర్భంగా భాస్కర్ మాట్లాడుతూ ట్రస్ట్ నియమ నిబంధనలను పాటిస్తూ కుల, మత, రాజకీయ పార్టీల ప్రస్తావన లేకుండా ట్రస్ట్ సేవలను ప్రజలకు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
Next Story




