Tanuku: చించినాడ బ్రిడ్జిపై మరో విషాదం గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబం!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా చించినాడ బ్రిడ్జిపై గోదావరిలోకి దూకిన తణుకుకు చెందిన నలుగురి కుటుంబం భార్య రక్షణ, ముగ్గురి కోసం గాలింపు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Updated on: 5 Sept 2026 12:54 PM IST
Tanuku
X

Tanuku: చించినాడ బ్రిడ్జిపై మరో విషాదం గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబం!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా య లమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. తణుకుకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు గోదావరి నదిలోకి దూకినట్లు సమాచారం.

ఈ ఘటనలో నంబూరి శ్రీనివాస్ (45), ఆయన భార్య నంబూరి పద్మిని (42), కుమారుడు నంబూరి ఈశ్వర్ (16), కుమార్తె నంబూరి నిత్య శ్రీ (15) ఉన్నట్లు సమాచారం.భార్య నంబూరి పద్మిని కొందరు జాలర్లు గుర్తించి ఆమెనే కాపాడే ప్రయత్నం చేశారు.

ఆమెను ప్రస్తుతం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఘటనకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా వేల్పూర్‌కు చెందిన ఓ కుటుంబం చించినాడ బ్రిడ్జి వద్ద గోదావరి నదిలోకి దూకిన ఘటన మరువకముందే, తాజాగా మరో కుటుంబానికి సంబంధించిన ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story