Polavaram: ఆదివాసి రేలా ఉత్సవాలకు వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు

Polavaram: పోలవరం జిల్లా కేంద్రం రంపచోడవరంలో మూడు రోజుల “ఆదివాసి రేలా ఉత్సవాలు” ఘనంగా ప్రారంభమయ్యాయి.

PRASANNA, RAMACHANDRAPURAM
Published on: 24 May 2026 5:37 PM IST
Polavaram
X

Polavaram: ఆదివాసి రేలా ఉత్సవాలకు వేలాదిగా తరలివచ్చిన గిరిజనులు

పోలవరం: జిల్లా కేంద్రం రంపచోడవరంలో ఆదివారం ప్రారంభమైన మూడు రోజుల “ఆదివాసి రేలా ఉత్సవాలు” ఘనంగా ఆరంభమయ్యాయి. జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి వేలాదిగా ఆదివాసీలు ఉత్సవాలకు తరలివచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం స్థానిక సిరిగిందలపాడు నుంచి అంబేద్కర్ సెంటర్ మీదుగా ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ర్యాలీ రంపచోడవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు కొనసాగింది. ర్యాలీలో గిరిజన యువతీ యువకులు సంప్రదాయ వేషధారణలో పాల్గొని ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. డప్పుల మోత, జానపద కళారూపాలతో రంపచోడవరం పట్టణం కళకళలాడింది.

అంబేద్కర్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్ద ఆదివాసి నాయకులు ప్రసంగించి గిరిజనుల ఐక్యత, సంస్కృతి పరిరక్షణపై పిలుపునిచ్చారు.

మూడు రోజులపాటు కొనసాగనున్న ఈ రేలా ఉత్సవాల్లో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ కళా ప్రదర్శనలు, గిరిజన ఆచార వ్యవహారాలకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

PRASANNA, RAMACHANDRAPURAM

PRASANNA, RAMACHANDRAPURAM

Next Story