VR Puram: విఆర్ పురం మండలంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విస్తృత ప్రచారం
VR Puram: విఆర్ పురం మండలం శ్రీరామగిరిలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై టీడీపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు.
VR Puram: విఆర్ పురం మండలంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విస్తృత ప్రచారం
విఆర్ పురం: పోలవరం జిల్లా విఆర్ పురం మండలం శ్రీరామగిరి గ్రామంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల అభివృద్ధి సంక్షేమం పై టిడిపి నాయకులు విస్తృత ప్రచారం చేసారు. మండల అధ్యక్షులు బొర్రా నరేష్ కుమార్ క్లస్టర్ ఇన్చార్జి వాళ్ళ రంగారెడ్డి టిడిపి వాణిజ్య విభాగ నియోజకవర్గ అధ్యక్షులు బీరక సూర్యప్రకాశ్ రావు ఆధ్వర్యంలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన అభివృద్ధి సంక్షేమం తోటి ముద్రించిన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు బొర్రా నరేష్ కుమార్ జడ్పిటిసి వాళ్ళ రంగారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుందని అలాగే అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని అన్నారు.
ఈ రెండేళ్ల కాలంలో ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని వారు అన్నారు. ఇంటింటికి ప్రజా సంక్షేమాన్ని అందించటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు నాళ్లరపు సత్యనారాయణ, కోడిసేల దుర్గారావు,పెట్టా వెంకన్న బాబు, ముత్యాల పోషి బాబు తదితరులు ప్రజలు పాల్గొన్నారు.




