Poduru: అన్నదాతలకు పెట్టుబడి సాయం.. ఎమ్మెల్యే కృషి అభినందనీయం
Poduru: ఆచంట నియోజకవర్గంలో 19,175 రైతు కుటుంబాల ఖాతాల్లో రూ.12.75 కోట్ల ‘అన్నదాత సుఖీభవ జమ కావడంపై టీడీపీ నేత రుద్రరాజు వ్యక్తం చేశారు.
Poduru: అన్నదాతలకు పెట్టుబడి సాయం.. ఎమ్మెల్యే కృషి అభినందనీయం
Poduru: పశ్చిమగోదావరి జిల్లా వ్యవసాయాభివృద్ధికి ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కృషి అభినందనీయం. నియోజకవర్గ వ్యాప్తంగా రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం రెండవ సంవత్సరం మొదటి విడత కింద రూ.7 వేల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం పట్ల టిడిపి నాయకులు రుద్రరాజు బంగార్రాజు (బంగారం) హర్షం వ్యక్తం చేశారు.
నియోజకవర్గంలోని 19,175 రైతు కుటుంబాలకు గాను రూ.12,75,19,000 నిధులు జమ కావడం రైతులకు ఆర్థికంగా ఎంతో ఊరటనిచ్చే చర్య అని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ రైతులు నారుమళ్లు సిద్ధం చేసుకోవడానికి, పొలాల్లో ట్రాక్టర్‌తో దమ్ము చేయించుకోవడానికి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి,
ఇతర వ్యవసాయ అవసరాలకు ఈ సాయం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతు కష్టాన్ని గుర్తించి సరైన సమయంలో నిధులు విడుదల చేయడం వల్ల చిన్న, సన్నకారు రైతులలో నూతన ఆశలు చిగురిస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతు కేంద్రిత పాలన అందిస్తోందని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు చర్చించుకోవడం సంతోషకరమని అన్నారు.
అలాగే గత రబి సీజన్‌లో పంటలను విక్రయించిన రైతులకు 24 గంటల్లోపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో వారి ఖాతాల్లోనే చెల్లింపులు జమ చేయడం సాధారణ విషయం కాదని, ఇది రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు.రైతు పండించిన ధాన్యానికి సరైన గౌరవం, సకాలంలో చెల్లింపు లభించడం వ్యవసాయ రంగానికి బలాన్నిస్తుందని పేర్కొన్నారు.
పోడూరు గ్రామంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన గ్రామ టిడిపి నాయకులను రుద్రరాజు బంగార్రాజు అభినందించారు. రైతులతో నేరుగా మమేకమై ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ప్రశంసనీయమని అన్నారు.
స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని రుద్రరాజు బంగార్రాజు పేర్కొన్నారు. నియోజకవర్గంలో సాగునీరు, రైతు సమస్యల పరిష్కారం, వ్యవసాయాభివృద్ధి చర్యల్లో ఎమ్మెల్యే చురుకుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతులకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందేలా కృషి కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
రైతే దేశానికి వెన్నెముక అని, రైతు అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి పునాది అని పేర్కొంటూ రైతుల సంక్షేమం కోసం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వనికి, ఎమ్మెల్యే పితాని చేపడుతున్న కార్యక్రమాలకు రైతాంగం అండగా నిలవాలని రుద్రరాజు బంగార్రాజు పిలుపునిచ్చారు.




