Iragavaram: ఐతంపూడి ఘటన బాధిత లావణ్యకు వైఎస్సార్సీపీ మహిళా నేతల సంఘీభావం

Iragavaram: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం ఐతంపూడిలో మాజీ సర్పంచ్ లావణ్యను పరామర్శించి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం తరఫున పూర్తి అండగా ఉంటామని భరోసా.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 17 Aug 2026 9:32 PM IST
Iragavaram
X

Iragavaram: ఐతంపూడి ఘటన బాధిత లావణ్యకు వైఎస్సార్సీపీ మహిళా నేతల సంఘీభావం

ఇరగవరం: తణుకు నియోజకవర్గం ఇరగవరం మండలం ఐతంపూడి గ్రామంలో మాజీ సర్పంచ్ లావణ్యకు జరిగిన అన్యాయంపై పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ మహిళా విభాగం నాయకులు స్పందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర, జిల్లా స్థాయి మహిళా నాయకులు సోమవారం ఐతంపూడి గ్రామానికి చేరుకుని లావణ్యను పరామర్శించి, జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం పూర్తి అండగా ఉంటుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా మహిళా నాయకులు మాట్లాడుతూ ఒక మహిళా ప్రజాప్రతినిధి అని కూడా చూడకుండా, రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆమె కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసి, ఆమె ఇల్లు కూల్చడం దుర్మార్గమైన చర్య అని ఖండించారు.

రాజకీయ విభేదాలు ఉన్నంత మాత్రాన మహిళలను, పేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. లావణ్య ఒంటరిగా లేరని ఆమె వెనుక వైఎస్సార్సీపీ మహిళా శక్తి మొత్తం ఉందని,అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాం, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం” అని మహిళా నాయకులు స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవెల్లి మంగ, పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడి విజయలక్ష్మి, భీమవరం నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కనుమూరి విజయదుర్గ, భీమవరం టౌన్ అధ్యక్షురాలు కృపామణి, భీమవరం 25వ వార్డు సెక్రటరీ పట్టెం శశితల్లి, జిల్లా సెక్రటరీ మొగ్గ మంగ, ఎస్. ఎలిజిబెత్ రాణి, ఎస్. ఆశాజ్యోతి, బుద్ధరాజు సత్యాదేవి, తణుకు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మెహర్ అన్సారీ, అత్తిలి మండల మహిళా అధ్యక్షురాలు కాకర్ల విశాలక్ష్మి, ఇరగవరం మండల మహిళా అధ్యక్షురాలు మెట్ల కిరణ్మయి, మాజీ AMC చైర్మన్ ఉండవల్లి జానకి, షేక్ ఫాహిమా తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story