Tanuku: తణుకు సబ్ జైలును సందర్శించిన న్యాయ సేవాధికార కార్యదర్శి
Tanuku: తణుకు సబ్ జైలును సందర్శించి ఖైదీల కేసుల గురించి ఆరా తీసిన ఉమ్మడి గోదావరి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్. శ్రీలక్ష్మి.
Tanuku: తణుకు సబ్ జైలును సందర్శించిన న్యాయ సేవాధికార కార్యదర్శి
తణుకు: ఉమ్మడి గోదావరి జిల్లాల న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ N శ్రీలక్ష్మీ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రిమాండ్లో ఉన్న ఖైదీల కేసులు విషయమై ఆరా తీసి, ప్రతి ఒక్కరు తమ తరపున వాదించుటకు న్యాయవాదిని పెట్టుకోవాలని సూచించారు.
న్యాయవాదిని పెట్టుకునే స్తోమత లేనివారికి న్యాయసేవాదికార సంస్థ ద్వారా ఉచితంగా న్యాయ వాదిని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, తప్పు చేసి తెలియదంటే కుదరదన్నారు. ప్రతి ఒక్కరూ కస్టపడి పనిచేసుకోవాలని,చట్ట వ్యతిరేక చర్యలు చేస్తే శిక్ష లు తప్పవని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జైలు విజిటింగ్ న్యాయవాది A అజయ్ కుమార్, పారా లీగల్ వాలంటీర్ దూలపల్లి బ్రహ్మాజీ, న్యాయవాదులు M రామ జ్యోతి, కొయ్యల విజయ కుమార్, జైలు సూపరింటెండెంట్ G మోహన రావు, సిబ్బంది పాల్గొన్నారు.




