Tanuku: వైన్ షాప్ వద్ద బీరు సీసాతో దాడి: ఒకరికి తీవ్ర గాయాలు!
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం దువ్వ శ్రీ ఝాన్సీ వైన్స్ వద్ద పాత కక్షలతో బీరు సీసాతో దాడి జరగగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Tanuku: వైన్ షాప్ వద్ద బీరు సీసాతో దాడి: ఒకరికి తీవ్ర గాయాలు!
తణుకు: పాత కక్షల నేపథ్యంలో మద్యం సేవిస్తూ జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తణుకు మండలం దువ్వ శ్రీ ఝాన్సీ వైన్స్ షాపు వద్ద మంగళవారం చోటుచేసుకుంది.
స్థానికులు పోలీసులు కథనం మేరకు.. దువ్వ గ్రామానికి చెందిన తంగెళ్ల రాంబాబు, లుకాలపు శివ ఇద్దరు స్నేహితులు కావడంతో స్థానిక శ్రీ ఝాన్సీ వైన్స్ షాపు వద్ద మద్యం సేవించేందుకు వెళ్లారు. ఇద్దరూ కలిసి మద్యం సేవిస్తుండగా గతంలో తనను దుర్భసలాడవని శివ రాంబాబుతో ఘర్షణ దిగాడు.
ఈ నేపథ్యంలో శివ తన వద్ద ఉన్న బీరు సీసా పగలగొట్టి రాంబాబుపై దాడి చేశాడు. ఈ దాడిలో రాంబాబుకు తీవ్ర గాయాల పాలై సంఘటన ప్రాంతంలో కుప్పకూలాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స నిమిత్తం తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రాంబాబును ఏలూరు తరలించారు.
ఇదిలా ఉంటే గతంలో ఝాన్సీ వైన్ షాప్ వద్ద ఇలాంటి సంఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా రాజకీయ నాయకుల ఓతిళ్ళతో పట్టించుకోవడం లేదని బాధితులు వాపోయారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. దీనిపై గ్రామీణ ఎస్ఐ ఎన్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సంఘటన ప్రాంతాన్ని పరిశీలించి సీసీ ఫుటేజ్ లు సేకరించామని తెలిపారు.
నిందితుడిని అదుపులోకి తీసుకొని హత్యాయత్నం కేసు నమోదు చేశామని వెల్లడించారు. దువ్వలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.




