Tanuku: తణుకు నారాయణ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం!
Tanuku: తణుకు నారాయణ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు. విద్యార్థులకు క్రీడా పోటీలు, విజేతలకు బహుమతుల ప్రదానం.
Tanuku: తణుకు నారాయణ పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవం!
Tanuku: తణుకు నారాయణ పాఠశాలలో శనివారం జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రీజినల్ ఇంచార్జీ సురేష్ మాట్లాడుతూ క్రీడలు శారీరక ,మానసిక వికాసానికి తోడ్పడతాయని పేర్కొన్నారు.
క్రీడాదినోత్సవ ప్రాముఖ్యతను, హాకీ క్రీడాకారుడు ధ్యాన్చంద్ జన్మ దినం గురించి వ్యాయామ ఉపాధ్యాయుడు అంబేద్కర్ వివరించారు. అనంతరం విద్యార్థులకు కబడ్డీ , కోకో , క్యారమ్స్ ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్స్,మెడల్స్ అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల డీన్ శ్రీనివాస్, వైస్ ప్రిన్సిపాల్ షాను, మాధవి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Next Story




