Tanuku: కారుమూరి అరెస్టుపై ఎమ్మెల్యే అరిమిల్లి సంచలన వ్యాఖ్యలు

Tanuku: మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తణుకు కూటమి కార్యాలయంలో మాట్లాడారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 24 Aug 2026 9:41 PM IST
Tanuku
X

Tanuku: కారుమూరి అరెస్టుపై ఎమ్మెల్యే అరిమిల్లి సంచలన వ్యాఖ్యలు

తణుకు: మద్యం అక్రమ రవాణా కేసులో మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అరెస్టు వ్యవహారంలో ఎలాంటి రాజకీయ కక్షలు లేవని ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ స్పష్టం చేశారు. తణుకు కూటమి కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాల్లో రూ.195 కోట్లు లావాదేవీలు జరిగాయని ఈడీ, సిట్ దర్యాప్తు సంస్థలు గుర్తించాయని వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసి దాని ద్వారా సానుభూతి పొందాలంటే రాష్ట్ర ప్రజలు, తణుకు నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.

గత వైసిపి హయాంలో ఎంతోమంది సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రులను అక్రమ అరెస్టులు చేసిన విషయం గుర్తు లేదాని ప్రశ్నించారు. జైలు యాత్రలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి కారుమూరిని జైలులో పరామర్శిస్తారా..? కారుమూరి కుమారుడు సునీల్ కుమార్ ఇదే కేసులో రెండు నెలలుగా జైలులో ఉంటే ఇప్పటివరకు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు.

ఐదేళ్లుగా కేటాక్స్ పేరుతో ఎన్నో అక్రమాలు దోపిడీలు చేసిన కారుమూరి ఇప్పుడు పర్యవసానం అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈడి సంస్థలతోపాటు అత్యున్నత న్యాయస్థానాలను సైతం తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్, చేనేత కార్పోరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story