Tanuku: కారుమూరిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి సాయిబాబా రెడ్డి
Tanuku: తణుకు వైసీపీ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొనసాగుతారని స్పష్టం చేసిన వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి సాయిబాబా రెడ్డి.
Tanuku: కారుమూరిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి సాయిబాబా రెడ్డి
తణుకు: తణుకు వైసీపీ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు కొనసాగుతారని, ఆయన స్థానంలో మరొకరు వస్తున్నారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని వైసీపీ లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబా రెడ్డి స్పష్టం చేశారు.
తణుకు వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కారుమూరి ఆయన తనయుడు రానున్న ఎన్నికల్లో పోటీలో ఉంటారని తెలిపారు.
కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలైన సూపర్ సిక్స్ అమలు చేయాలని, తప్పుడు ప్రచారాలు మానుకుని ప్రజలకు మంచి పాలన అందించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇస్తామని నిరుద్యోగ యువతను మోసం చేసారని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Next Story




