Tanuku: తణుకు ఎమ్మెల్యే, తహసిల్దార్‌లకు సీజేఏసీ వినతిపత్రం!
Tanuku: తణుకు మండలంలో క్రైస్తవులకు సమాధుల స్థలాలు కేటాయించాలని తహసిల్దార్, ఎమ్మెల్యేలకు వినతిపత్రం సమర్పించిన సీజేఏసీ ప్రతినిధులు.
Tanuku: తణుకు ఎమ్మెల్యే, తహసిల్దార్‌లకు సీజేఏసీ వినతిపత్రం!
Tanuku: తణుకు మండల పరిధిలో క్రైస్తవులకు ప్రత్యేక సమాధి స్థలాలు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ CJAC ఆధ్వర్యంలో ప్రతినిధులు శుక్రవారం తహసిల్దార్ అశోక్ వర్మ, ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణలను కలిసి వినతి పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా బిషప్ హరత్ బాబు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో క్రైస్తవుల సమాధుల కోసం కనీసం ఒక ఎకరం, తణుకు మున్సిపాలిటీ పరిధిలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కనీసం ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని కోరారు.
రహదారి సౌకర్యం ఉన్న అనువైన ప్రభుత్వ భూమిని గుర్తించి, అధికారిక రికార్డుల్లో నమోదు చేసి, ఆక్రమణలకు గురికాకుండా రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. దశాబ్దాలుగా సమస్య కొనసాగుతున్నందున జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, త్వరితగతిన చర్యలు చేపట్టాలని కోరారు.
కార్యక్రమంలో UCA, TUPF, TMPF, TEAM ప్రతినిధులు, పాస్టర్లు జె.ఎస్.రావు, యం. యేసురత్నం, వి.షాలెం రాజు, ఓ.మనోజ్ బాబు, పి.ఐ. బ్రెన్‌హామ్, కె.ఎస్. రాజు, కె. డేవిడ్ బాబు, యస్. కృపావరం తదితరులు పాల్గొన్నారు.




