Tanuku: తణుకులో ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహాపై దాడికి నిరసన

Tanuku: జార్ఖండ్‌లో ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహాపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన తణుకు ఐసా, ఎస్ఎన్‌పీఎస్ నాయకులు. నిరసన ప్రదర్శన.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 8 Aug 2026 7:26 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో ఐసా జాతీయ అధ్యక్షురాలు నేహాపై దాడికి నిరసన

తణుకు: పేపర్ లీకేజీలు, పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా ఏఐ యస్ఏ (ఐసా)జాతీయ అధ్యక్షురాలు నేహా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న జాతాలో భాగంగా జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచిలో ఆమెపై కొంతమంది అల్లరి మూకలు దాడి చేసి సిరా ఇంక్ పోయడాన్ని ఐసా తీవ్రంగా ఖండిస్తుందని ఏఐయస్ఏ జిల్లా కార్యదర్శి టి అప్పలస్వామి, ఎస్ ఎన్ పి ఎస్.రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు పేరూరి మురళి కుమార్లు విమర్శించారు.

నేహాపై జరిగిన దాడికి నిరసనగా శనివారం తణుకులో స్థానిక వెంకటేశ్వర సెంటర్ నందు ఐసా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకు నాయకులు మాట్లాడుతూ రాంచీలో ఐసా, ఆర్వై ఏ ఆధ్వర్యంలో పేపర్ లీకేజీలు పరీక్షల అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన శాంతియుత ర్యాలీపై జరిగిన గుండాల దాడి అత్యంత హేయమైన ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యని విమర్శించారు.

ముఖ్యంగా ఐసా జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా పై ఒక అగంతుక వ్యక్తి సిరా ఇంక్ పోయిడాని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉన్నదని దీని వెనుక ఆర్ఎస్ఎస్ , బిజెపి నాయకుల ప్రొద్బలం తెలిపారు. దాడి చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దాడులతో ఉద్యమాన్ని ఆపలేరని ఉద్యమాలను ఆపడం ఎవరి తరం కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎన్పి ఎస్ జిల్లా నాయకులు బాతు వేణుగోపాల్ , ఎలిపే సురేష్, ఐసా నాయకులు యు మురళి, జి పృద్వి , వి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story