Penugonda: గరగాలమ్మ దిబ్బలో నూతన ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
Penugonda: పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలోని గరగాలమ్మ దిబ్బలో శ్రీ గరగాలమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు.
Penugonda: గరగాలమ్మ దిబ్బలో నూతన ఆలయ పునర్నిర్మాణ పనులు ప్రారంభం
Penugonda: పెనుగొండ మండలం, సిద్ధాంతం గ్రామంలోని గరగాలమ్మ దిబ్బలో శ్రీ గరగాలమ్మ అమ్మవారి నూతన ఆలయ నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాన్ని శెట్టిబలిజ సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
వేదమంత్రోచ్ఛారణల నడుమ ఆలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని మామిడిశెట్టి నాగభూషణం–మంగమ్మ, కంబాల వెంకటేష్–వరలక్ష్మి , కంబాల శ్రీను–సత్యవాణి, బండి జయరాజు–పద్మ , వట్టికూటి హనుమంతరావు–దుర్గాభవాని దంపతులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ పునర్నిర్మాణం ద్వారా గ్రామంలో అమ్మవారి అనుగ్రహంతో గ్రామ ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో కట్ట శ్రీనివాస్, మామిడి శెట్టి వెంకటేశ్వరరావు, దంగేటి విష్ణు శెట్టిబలిజ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.




