Tanuku: భాష్యం స్కూల్‌లో చట్టాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు భాష్యం స్కూల్ లో విద్యార్థులకు సైబర్ క్రైమ్స్, పోక్సో చట్టాలపై రూరల్ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు అవగాహన సదస్సు నిర్వహించారు.
Tanuku: భాష్యం స్కూల్‌లో చట్టాలపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సు
తణుకు: విద్యార్థులు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తణుకు గ్రామీణ ఎస్సై ఎన్.శ్రీనివాసరావు అన్నారు. తణుకు భాష్యం స్కూల్‌లో విద్యార్థులకు గురువారం భారత న్యాయవ్యవస్థ, సైబర్ క్రైమ్స్, ఈవ్ టీజింగ్, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుడ్ టచ్–బ్యాడ్ టచ్‌పై అవగాహన కలిగి ఉండాలని, ఎలాంటి వేధింపులు, అనుమానాస్పద సంఘటనలు జరిగినా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు,పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో జెడ్ఈఓ శ్రీమన్నారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ గంట పాండురంగరావు, ఏఎస్ఐ రంగారావు,ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Next Story




