Tanuku: తణుకు మండలం వేల్పూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో గంజాయి, అసాంఘిక కార్యకలాపాల నివారణకు పోలీసుల కార్డెన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 7 బైకులు స్వాధీనం.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 13 Sept 2026 1:43 PM IST
Tanuku
X

Tanuku: తణుకు మండలం వేల్పూరులో పోలీసుల కార్డెన్ సెర్చ్!

Tanuku: గంజాయి, అసాంఘిక కార్యక్రమాల నిర్మూలన లక్ష్యంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తణుకు మండలం వేల్పూర్ గ్రామంలో శనివారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు.

ఈ సందర్భంగా తణుకు గ్రామీణ, పట్టణ సీఐలు డి.వెంకటేశ్వరరావు, జే వెంకటరమణ నేతృత్వంలో 75 మంది పోలీస్ సిబ్బందితో విష్ణు ప్రియ నగర్, కామధేను నగర్ లో కార్డెన్ సెర్చ్ కార్యక్రమం చేపట్టారు.

దీనిలో భాగంగా అనుమానిత ఇళ్లను, అనుమానిత ప్రదేశాలను తనిఖీలు చేసిఎటువంటి దస్త్రాలు లేని ఏడు ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో గ్రామీణ ఎస్సై నాళం శ్రీనివాసరావు సిబ్బంది పాల్గొన్నారు

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)