Penugonda: ఎస్‌వీకేపీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
Penugonda: ఎస్‌వీకేపీ కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.వి.అప్పారావు అధ్యక్షతన తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
Penugonda: ఎస్‌వీకేపీ కళాశాలలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం
పెనుగొండ: ఎస్వికెపి డాక్టర్ కె.ఎస్ రాజు ఆర్ట్ అండ్ సైన్స్ కళాశాల అటానమస్ లో తెలుగు విభాగం గిడుగు వెంకట రామమూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ వై.వి.వి.అప్పారావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవాన్ని గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా జరుపుకుంటామని ఆయన తెలుగు గ్రాంధిక భాషను వ్యవహారిక భాషగా సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి అనలేనిది అని వ్యాఖ్యానించారు.
రూపాయి నోటు మీద ఉన్న 15 భాషలలో తెలుగు ఒకటని, 60 సంవత్సరాల క్రితం అధికార భాషగా గుర్తించబడిన తెలుగు భాష కీర్తి అనలేనిదని వివరించారు. ఈ సందర్భంగా కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష చైర్మన్ తెలుగు భాష విభాగ అధిపతి డి.ఆర్.జి డిగ్రీ కళాశాల పెంటపాడు ఆచార్యులు డాక్టర్ సుంకర గోపాలయ్య తెలుగు భాష వైభవం, తెలుగు భాష సాహిత్యం, గురించి వివరిస్తూ తెలుగు భాషలో అసాధారణమైన సంపద ఉందని తెలుగు సాహిత్యం సంస్కారం తీసుకొస్తుందని పరభాష నేర్చుకుంటే ప్రపంచానికి నీవు పరిచయమైతే తెలుగు భాష నేర్చుకుంటే ప్రపంచం నీకు పరిచయం అవుతుంది అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా నన్నయ తిక్కన, ఎఱ్ఱన , గురజాడ అప్పారావు లాంటి ఎంతోమంది తెలుగు కవులను గుర్తుచేస్తూ తెలుగు వ్యాకరణాన్ని మేళవిస్తూ తెలుగు భాష వైభవాన్ని క్షుణ్ణంగా వివరించారు. తదనంతరం తెలుగు భాష సందర్భంగా నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రిన్సిపాల్ ముఖ్య అతిథి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగాధిపతి కర్ని సురేష్ బాబు తెలుగు అధ్యాపకులు బి.వెంకట సుబ్బారావు ఆఫీస్ సూపరింటెండెంట్ సంక్రాంతి సూర్యనారాయణ, మరియు టీ దివాకర్, డాక్టర్ కె. లక్ష్మీకాంతమ్మ, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.




