Penugonda: భాష్యం పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాలు

Penugonda: పెనుగొండ భాష్యం పాఠశాలలో తెలుగు భాషా దినోత్సవం, జాతీయ క్రీడా దినోత్సవాలను విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలతో ఘనంగా నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 29 Aug 2026 7:14 PM IST
Penugonda
X

Penugonda: భాష్యం పాఠశాలలో ఘనంగా తెలుగు భాషా, జాతీయ క్రీడా దినోత్సవాలు

పెనుగొండ: స్థానిక కంబాల వారి వీధిలో గల భాష్యంపాఠశాలలో *ది:29-08-26 శనివారం నాడు తెలుగు భాషా మాధుర్యాన్ని, క్రీడాస్ఫూర్తి గొప్పదనాన్ని ప్రతిబింబిస్తూ "తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవం" కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు.ముందుగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు జాతి గర్వించదగిన మహాకవి, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి పంతులు గారి సేవలను స్మరించుకున్నారు.

విద్యార్థులు తెలుగు భాష గొప్పతనం,మాతృభాష ప్రాధాన్యం,తెలుగు సంస్కృతి–సంప్రదాయాల విశిష్టతను తెలియజేస్తూ ప్రసంగాలు,పద్యాలు, పాటలు, నృత్యాలు, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. “దేశభాషలందు తెలుగు లెస్స” అనే నినాదం విద్యార్థుల కంఠాల నుంచి మార్మోగి తెలుగు భాషపై ప్రేమాభిమానాలను చాటుకున్నారు.

అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ గారి క్రీడా సేవలను స్మరించుకున్నారు.క్రీడలు శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలు, ఓటమిని ధైర్యంగా ఎదుర్కొనే మనోధైర్యాన్ని పెంపొందిస్తాయని ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎన్ వి అప్పారావు గారు విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ క్రీడా పోటీలలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విజేతలకు అభినందనలు తెలియజేస్తూ,ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని ప్రిన్సిపల్ సూచించారు.

“భాష మన సంస్కృతికి పునాది – క్రీడ మన జీవితానికి బలం” అనే సందేశంతో నిర్వహించిన ఈ ద్వంద్వ వేడుకలు విద్యార్థుల్లో మాతృభాషపై మమకారాన్ని, క్రీడలపై ఆసక్తిని మరింత పెంపొందించాయి.ఈ కార్యక్రమంలో భాష్యం విద్యాసంస్థల వెస్ట్ జోన్ ఇంచార్జ్ శ్రీ ఏ శ్రీమన్నారాయణ రెడ్డి గారు చాంప్స్ ఇంచార్జ్ శ్రీమతి రాణి రోజాజీ గారు ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story