Bhimavaram: ఉపాధ్యాయులపై దాడులను తీవ్రంగా ఖండించిన PDF ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి!

Bhimavaram: ఏలూరు జిల్లా రావికంపాడు జెడ్పీ స్కూల్ హెచ్‌ఎంపై దాడిని తీవ్రంగా ఖండించిన PDF ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. ఉపాధ్యాయులకు రక్షణ చట్టాలు తెవాలని డిమాండ్.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Updated on: 22 Aug 2026 3:13 PM IST
Bhimavaram
X

Bhimavaram: HM పై దాడి అన్యాయం ప్రభుత్వం కఠిన చట్టాలు తెవాలి!

Bhimavaram: ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం రావికంపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి (HM) పై విద్యార్థి తల్లిదండ్రులు భౌతిక దాడికి పాల్పడటాన్ని ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (PDF) ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి తీవ్రంగా ఖండించారు.

​పాఠశాల కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేని ఒక కుటుంబాన్ని, వారి వ్యక్తిగత నివాస ప్రాంగణంలో జరిగిన సంఘటనను పాఠశాలకు ముడిపెడుతూ ఉపాధ్యాయులపై దాడి చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు. ఇటువంటి చర్యలు ఉపాధ్యాయ వర్గాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

పాఠశాలల్లో బోధన చేసే ఉపాధ్యాయులకు, ఆసుపత్రుల్లో వైద్యసేవలు అందించే వైద్యులకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా ప్రభుత్వం వెంటనే కఠినమైన చట్టాలను రూపొందించాలన్నారు. ఉపాధ్యాయులు ఎలాంటి భయభ్రాంతులు లేకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యార్థులకు పాఠాలు చెప్పే పరిస్థితిని విద్యాశాఖ కల్పించాలని కోరారు.

రావికంపాడు ఘటనపై వెంటనే స్పందించి, ప్రధానోపాధ్యాయుడిపై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా, ఉపాధ్యాయుల ఆత్మరక్షణకు విద్యాశాఖ మరియు పోలీసు శాఖల సమన్వయంతో సత్వర స్పందన వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

Next Story