Narsapuram: తూర్పుతాళ్ల పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం
Narsapuram: పశ్చిమగోదావరి జిల్లా తూర్పుతాళ్ల జెడ్పీ పాఠశాలలో మెగా పీటీఎంలో పాల్గొన్న మంత్రి ఎస్. సవిత. ప్రభుత్వ విద్యపై విశ్వాసం ఉంచాలని పిలుపు.
Narsapuram: తూర్పుతాళ్ల పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం
నరసాపురం: పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లికి వందనం కార్యక్రమం, మెగా పేరెంట్స్ డేలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవితమ్మ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోవని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులు, నాణ్యమైన బోధన, విద్యార్థులకు క్వాలిటీ ఫుడ్, విశాలమైన ఆటస్థలాలు వంటి అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు.
విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించి పెద్ద ఎత్తున ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నామనే గిల్టీ ఫీల్ ఎవ్వరూ పడొద్దు. ఒకప్పుడు మనమంతా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి వచ్చాం. ప్రభుత్వ విద్యపై ప్రతి ఒక్కరూ విశ్వాసం ఉంచాలి అని మంత్రి పిలుపునిచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనాన్ని ప్రచారం కోసం వినియోగిస్తూ కిట్లపై వారి ఫోటోలు ముద్రించుకునేవారని విమర్శించిన మంత్రి, ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న విద్యా కిట్లపై భారత మాజీ రాష్ట్రపతి, గొప్ప విద్యావేత్త డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రాన్ని ముద్రించి పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని ఆమె పేర్కొన్నారు.




