Penumantra: ZPHSలో ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీడీవో!
Penumantra: నెగ్గిపూడి ZPHS పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీవో ఆర్.ఏ.ఎల్. సుజాత. విద్యార్థులతో కలిసి భోజనం చేసి నాణ్యత పరిశీలన.
Penumantra: ZPHSలో ఆకస్మిక తనిఖీ: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపీడీవో!
పెనుమంట్ర: నెగ్గిపూడి గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పెనుమంట్ర ఎంపీడీవో ఆర్.ఏ.ఎల్. సుజాత ఆకస్మికంగా తనిఖీ చేశారు.
డిప్యూటీ ఎంపీడీవో ఎస్.డబ్ల్యూ.కె. వెంకటరెడ్డితో కలిసి పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత, వంటశాల నిర్వహణ తదితర అంశాలను అధికారులు పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి అధికారులు మధ్యాహ్న భోజనం చేశారు.
విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందేలా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై కూడా వారు ఆరా తీశారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు తరచూ పర్యవేక్షించాలని పేర్కొన్నారు.




