Tanuku: తణుకులో రోడ్డు ప్రమాదం తల్లి, రెండేళ్ల చిన్నారి మృతి!
Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి లావణ్య, రెండేళ్ల కుమార్తె కీర్తన మృతి చెందారు.
Tanuku: తణుకులో రోడ్డు ప్రమాదం తల్లి, రెండేళ్ల చిన్నారి మృతి!
Tanuku: రోడ్డు ప్రమాదంలో తల్లి, కుమార్తె మృతి, తండ్రి పరిస్థితి విషమం.
భాష్యం బ్లూమ్స్ స్కూల్ వద్ద ఎత్తుగా ఏర్పాటు చేసిన వేగనిరోధకలతో చోటుచేసుకున్న ప్రమాదం.
తణుకు భాష్యం బ్లూమ్స్ స్కూల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి తో పాటు తల్లి మృతి చెందగా తండ్రి పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు పోలీసులు కథనం మేరకు.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన గంధం వంశీకృష్ణ, లావణ్య (25) దంపతులతో పాటు కుమార్తె కీర్తన (2) కలసి ద్విచక్ర వాహనంపై భాష్యం బ్లూమ్స్ స్కూల్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో స్కూల్ వద్ద రహదారిపై వేగనిరోధకం ఎత్తుగా ఉండడంతో ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయారు. దీంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా క్షతగాత్రులను 108 లో తణుకు జిల్లా ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ చిన్నారి తల్లి లావణ్య మృతి చెందింది. తండ్రి వంశీకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే స్కూలు వద్ద రహదారిపై వేగనిరోధకాలు ఎత్తుగాఏర్పాటు చేయడంతో పాటు సంబంధిత అధికారులు ఎటువంటి మార్గ సూచికలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు చెబుతున్నారు ఈ సంఘటనపై తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.




