Bheemadolu: హాస్టల్ విద్యార్థులకు నిత్యావసరాల పంపిణీ ఎమ్మెల్యే ధర్మరాజు
Bheemadolu: సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు స్వెటర్లు, దుప్పట్లు, నైట్ డ్రెస్సులు, కార్పెట్లు, టవళ్లను ఉంగుటూరు ఎమ్మెల్యే కూటమి నాయకులతో కలిసి పంపిణీ చేశారు.
Bheemadolu: హాస్టల్ విద్యార్థులకు నిత్యావసరాల పంపిణీ ఎమ్మెల్యే ధర్మరాజు
భీమడోలు: విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు గారు పేర్కొన్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిని సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణంలో విద్యాభ్యాసం కొనసాగించేలా అవసరమైన వసతులను ప్రభుత్వం దశలవారీగా అందజేస్తోందని తెలిపారు.
ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ప్రభుత్వం విద్యార్థిని, విద్యార్థులకు అందించిన స్వెట్టర్లు, దుప్పట్లు, నైట్ డ్రెస్సులు, కార్పెట్లు, టర్కీ టవల్స్ తదితర నిత్యావసర సామగ్రిని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు గారు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి విద్యార్థినులకు పంపిణీ చేశారు.
విద్యార్థుల సంక్షేమం, వారి భవిష్యత్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ స్థాయి జనసేన, టీడీపీ, బీజేపీ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.




