Tanuku: 396 జీవోను వెంటనే రద్దు చేయాలి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణకు

Tanuku: దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్ల ఉపాధి దెబ్బతీసే 396 జీవోను రద్దు చేయాలని కోరుతూ తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు వినతిపత్రం సమర్పించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 21 July 2026 3:41 PM IST
Tanuku
X

Tanuku: 396 జీవోను వెంటనే రద్దు చేయాలి తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణకు

తణుకు: ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయాలను ప్రైవేటు పరం చేసి, దస్తావేజు లేఖర్ల ఉపాధికి నష్టం కలిగించే 396 జీవోను రద్దు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు దస్తావేజులేఖర్లు స్టాంప్ వెండర్లు వినతిపత్రాన్ని సమర్పించారు.

ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ పిలుపుమేరకు తణుకు, సజ్జాపురం సబ్ రిజిస్టర్కా ర్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు రెండో రోజులో భాగంగా మంగళవారం రిలే దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ 396 జీవోను జారీ చేసిందని తెలిపారు. దీనివల్ల దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు జీవనోపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టడం ద్వారా ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని వారి ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్లు అవుతుందని రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రైవేటు పరం చేసే నిర్ణయంపై ప్రభుత్వం ఉపసంహరించుకొనే విధంగా అసెంబ్లీలో ప్రతిపాదించి తమకు న్యాయం చేయాలని కోరారు.

దీనిపై ఎమ్మెల్యే రాధాకృష్ణ స్పందిస్తూ.. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు అల్లూరి సూర్యనారాయణ రాజు, అధ్యక్షుడు పిఎల్ శ్రీనివాస్,కార్యదర్శి బోడ నాగబాబు, సంఘ తణుకు సజ్జాపురం నాయకులు చామంతి శ్రీనివాసరావు, మండపాక సూర్య వెంకట భాస్కర్,తూల పోతురాజు, కామర్సు ప్రసాద్, సిహెచ్ ఎస్ఎన్ రమేష్, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్స్ పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story