Tanuku: దువ్వ జెడ్పీ స్కూల్‌లో ఘనంగా 'మెగా పిటిఎం 4.0'

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ జెడ్పీ పాఠశాలలో నిర్వహించిన మెగా పిటిఎం 4.0 కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 24 July 2026 4:58 PM IST
Tanuku
X

Tanuku: దువ్వ జెడ్పీ స్కూల్‌లో ఘనంగా 'మెగా పిటిఎం 4.0'

Tanuku: విద్యార్థులకు నాణ్యమైన విద్య, అత్యాధునిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పేర్కొన్నారు. తణుకు మండలం దువ్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ 4.0 కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని తెలిపారు.

శ్రీ ముళ్లపూడి హరిచంద్ర ప్రసాద్ జిల్లా పరిషత్ హై స్కూల్‌ను నియోజకవర్గ మోడల్ స్కూల్‌గా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story