Chintoor: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కూటమి నేతలు!
Chintoor: చింతూరు మండలం చూటూరు గ్రామంలో కూటమి నాయకులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.
Chintoor: సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న కూటమి నేతలు!
చింతూరు: చింతూరు మండలం చూటూరు గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం అభివృద్ధి పథకాలపై కూటమి నాయకులు డోర్ టు డోర్ ప్రచారం చేశారు.
ముకునూరు పంచాయతీ చూటూరు గ్రామంలోని 355వ బూత్‌లో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పై గ్రామస్తులకు వివరించారు.
ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ,అభివృద్ధి పథకాలు అమలు చేసిందని అన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండదండ లు అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల క్లస్టర్ ఇంచార్జ్ ఓబిళ్లనేని నర్సింహారావు, ప్రధాన కార్యదర్శి మల్లెల వెంకటేశ్వరరావు, యూనిట్ ఇంచార్జ్ సీలం తమ్మయ్య, బూత్ ఇంచార్జ్ కారం సత్యవతి, జట్పాటి అంజి పాల్గొన్నారు. జనసేన నాయకులు బేడే సతీష్, తీగల రవి, మల్లిపూడి సతీష్, పయ్యాల ప్రవీణ్, మిడియం రమణమ్మ, పోడియం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.




