Rampachodavaram: గిరిజన లా విద్యార్థినికి రూ. లక్ష ఆర్థిక సాయం!
Rampachodavaram: రంపచోడవరం ఐటీడీఏ, పోలవరం జిల్లా జేసీ సురపాటి ప్రశాంత్ కుమార్ చేతుల మీదుగా గిరిజన లా విద్యార్థినికి రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్కు అందజేత.
Rampachodavaram: గిరిజన విద్యార్థినికి రూ. లక్ష ఆర్థిక సాయం!
Rampachodavaram: పోలవరం జిల్లా, ఏజెన్సీలోని గిరిజన విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదువుకునే విధంగా ప్రోత్సహించడం జరుగుతుందని రంపచోడవరం ఐ టీ డి ఏ ప్రాజెక్ట్ అధికారి,పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక జాయింట్ కలెక్టర్ వారి ఛాంబర్ లో పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో అడ్డతీగల మండలం సోమన్నపాలెం గ్రామానికి చెందిన గిరిజన విద్యార్థి బూడిద లోవ కుమారి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదులో ఎల్.ఎల్.బి పూర్తి చేసి పీజీ లా చేయుటకు ఆర్థిక సహాయం చేయుటకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థికి ఐటీడీఏ ద్వారా బూడిద లోవ కుమారికి లక్ష రూపాయల చెక్కును జాయింట్ కలెక్టర్ వారి చేతిలో మీదుగా అందజేయడం జరిగింది.
బూడిద లోవ కుమారి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్.ఎల్.బి పూర్తి చేసి పీజీ లా చేయుటకు దామోదర్ సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీలో క్లాట్ 2026 జాతీయస్థాయిలో ర్యాంకు ప్రతిభ కనబరిచి లా మాస్టర్స్ చదువుకు ఎంపికైన గిరిజన విద్యార్థికి పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ప్రశాంత్ కుమార్ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, పోలవరం జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఉన్నత విద్యను అభ్యసించి న్యాయ రంగంలో రాణించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న గిరిజన విద్యార్థి ఆర్థిక ఇబ్బందులను తెలుసుకొని విద్యార్థి మాస్టర్ లా చేయు యుటకు పోలవరం జిల్లా కలెక్టర్ కే దినేష్ కుమార్ వారి ఆధ్వర్యంలో రంపచోడవరం ప్రాజెక్టు అధికారి సురపాటి ప్రశాంత్ కుమార్ వారి చేతుల మీదుగా లక్ష రూపాయలు చెక్కును అందజేయడం జరిగింది.
లా విద్యార్థి అయినటువంటి బూడిద లోవ కుమారి మాట్లాడుతూ మా తల్లిదండ్రులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ నాకు ఉన్నతమైన చదువులు చదువుకునే విధంగా ప్రోత్సహించడం జరిగిందని లా మాస్టర్ చేయుటకు మేము చాలా పేద కుటుంబం నుంచి వచ్చినవారు అని నేను లా మాస్టర్ డిగ్రీ చేయుటకు జిల్లా కలెక్టర్ వారికి, జాయింట్ కలెక్టర్ వారికి దరఖాస్తులు సమర్పించిన వెంటనే నా ఆర్థిక ఇబ్బందులు తెలుసుకొని నేను మాస్టర్ల డిగ్రీ చేయుటకు వెంటనే లక్ష రూపాయలు మంజూరు చేసినటువంటి జిల్లా కలెక్టర్ వారికి, జాయింట్ కలెక్టర్ వారికి నా కుటుంబం తరఫున నా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఆమె తెలిపారు. నేను మాస్టర్ లా చేసిన తర్వాత ఈ ప్రాంత గిరిజనులకు సేవ చేయుటకు ఈ ఆర్థిక సహాయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆమె అన్నారు.




