Iragavaram: ఇరగవరంలో ఆర్‌జీఎస్‌ఏ వార్షిక ప్రణాళికపై శిక్షణా కార్యక్రమం

Iragavaram: ఇరగవరం మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్లకు ఆర్‌జీఎస్‌ఏ (RGSA) వార్షిక కార్యాచరణ తయారీపై ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 18 Jun 2026 8:35 PM IST
Iragavaram
X

Iragavaram: ఇరగవరంలో ఆర్‌జీఎస్‌ఏ వార్షిక ప్రణాళికపై శిక్షణా కార్యక్రమం

Iragavaram: ఇరగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో తణుకు, ఇరగవరం మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులకు, డిజిటల్ అసిస్టెంట్స్ లకు RGSA 2026-27 TNA ఆధారిత RGSA వార్షిక కార్యాచరణ తయారీ పై గురువారం ఓరియంటేషన్ మండల స్థాయి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కోర్స్ డైరెక్టర్ & మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు వార్షిక కార్యాచరణ తయారీ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పన, గ్రామసభల నిర్వహణ, ప్రజల అవసరాల గుర్తింపు, అభివృద్ధి పనుల ప్రాధాన్యత క్రమ నిర్ణయం మరియు గ్రామాల సమగ్ర అభివృద్ధికి కీలకమని, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు.

అనంతరము గ్రేడ్ II& గ్రేడ్VI పదోన్నతిపై వెళ్ళిన పంచాయతీ అభివృద్ధి అధికారులుకు,మరియు గ్రేడ్ II& గ్రేడ్VI పదోన్నతి పై ఇరగవరం మండలమునకు వచ్చిన పంచాయతీ అభివృద్ధి అధికారులను ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో తణుకు,ఇరగవరం మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులు, డిజిటల్ అసిస్టెంట్స్, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story