Kukkunoor: ముడుపులిస్తే సహకరిస్తామంటున్న అధికారులు!
Kukkunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అక్రమ బోర్ల దందా! నర్సరీల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు.
Kukkunoor: ముడుపులిస్తే సహకరిస్తామంటున్న అధికారులు!
ఏలూరు జిల్లా: కుక్కునూరు మండలంలోని బంజర గూడెం, తొండిపాక, ఇబ్రహీంపేట, మిట్టగూడెం, గణపవరం, గుంపెనపల్లి, బోనగిరి, అల్లిగూడెం, పెదరాయిగూడెం, వెంకటాపురం, వేలేరు గ్రామాల్లో జామాయిల్, జామ క్లోన్ నర్సరీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. కొందరు వ్యక్తులు అటవీ, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో నర్సరీ ఆవరణలో రెండు నుంచి మూడు బోర్లను అనుమతులు లేకుండానే తవ్వుతున్నారు.
సమాచారం ప్రకారం పైన పేర్కొన్న గ్రామాల పరిధిలో సుమారు 10 వేలకు పైగా అక్రమ బోర్లు వెలిశాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణకు చెందిన రిగ్గు యంత్రాలతో పగలు రాత్రిని తేడా లేకుండా ఈ తవ్వకాలు జరుగుతు న్నట్లు తెలుస్తోంది. జామాయిల్, జామ క్లోన్ నర్సరీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బోర్లు తవ్వకాలు జరుగుతున్నప్పటికీ అధికారులు ముడుపులు తీసుకొని సహకరిస్తూ ఉండడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు పంట పొలాకు పరిమితమైన బోర్లు ఇప్పుడు అధికారుల అండతో నర్సరీల్లో విచ్చలవిడిగా బోర్ల తవ్వకాలు ఎక్కువ అవుతున్నాయి. బోర్లను తవ్వాలంటే సంబంధిత మండలాల తహసీల్దార్ల వద్ద అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికి నిబంధనలను ఎవరు పాటించకపోవడం ఒకింతైతే అధికారులు క్షేత్రస్థాయిలో అమలు చేయకపోవడం మరోఎత్తు.
నర్సరీల్లో అక్రమ బోర్ల తవ్వకాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు ఇండ్లలో నీటి అవసరాల కోసం బోరు వేస్తుంటే అడ్డుకుంటున్నారని, ఇంటి యజమాని అధికారులకు ముడుపులు చెల్లిస్తే మాత్రం బోరు వేసుకోవడానికి అనుమతులు ఇస్తున్నారని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. పెదరాయి గూడెం గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటి వద్ద బోరు వేయిస్తుండగా పెదరాయి గూడెం వీఆర్వో స్థానిక వీఆర్ఏ ని పంపి అనుమతులు లేకుండా బోరు తవ్వకాలు జరుపుతున్నారని, బోరు తవ్వకాలను ఆపించి , రిగ్గును సీజ్ చేస్తామన్నారని వచ్చిన వీఆర్ఏ తెలపడంతో
స్థానిక వీఆర్ఏ వీఆర్వో కు ఫోన్ చేసి స్థానికులతో మాట్లాడించగా ఇండ్లలో బోర్ వేస్తుంటే ఆపి రిగ్గును సీజ్ చేస్తామని అంటున్నారు సరే, నర్సరీల్లో నర్సరీలలో అనుమతులు లేకుండా నిత్యం పగలు రాత్రిని తేడా లేకుండా విచ్చలవిడిగా బోరుబావుల తవ్వకాలు జరుపుతున్న పట్టించుకోని రెవిన్యూ అధికారులు నీటి అవసరాల కోసం ఇండ్లలో బోర్లు వేస్తుంటే మాత్రం అనుమతులు తీసుకోకుండా బోర్లతో తవ్వకాలు జరుపుతున్నారని, వాటిని నిలుపుదల చేయాలని చెబుతున్న అధికారులు నర్సరీలో అక్రమంగా వేస్తున్న బోర్ల నిలుపుదల చేసి రిగ్గులను ఎందుకు సీజ్ చేయడం లేదు అని అడగ్గా వీఆర్వో మాట్లాడుతూ ఈమధ్య కాలంలో మిట్ట గూడెం గ్రామంలో బోర్ వేస్తుండగా సమాచారం రావడంతో రెవిన్యూ సిబ్బంది వెళ్లి రిగ్గును సీజ్ చేసి ఐదు వేలు ఫైన్ వేసి, నాలగు రోజులు తొండిపాక సచివాలయంలో ఉంచామని స్థానిక నాయకులు పదిహేను వేలు ఇవ్వగా అధికారులు వదిలారని, అలా మీరేమన్నా చేయగలిగితే వదిలేసి వెళ్తామని తెలపడంతో ఐదు వేలు ఇస్తామని స్థానికులు తెలపగా అందుకు సరే అని వీఆర్వో చెప్పడంతో ఐదు వేల రూపాయల తమకు ఫోన్ పే చేయాలని అడగ్గా వీఆర్ఏకి చేయండి అని చెప్పడంతో 8.10 నిమిషాల సమయంలో స్థానిక వీఆర్ఏకి ఐదు వేల రూపాయలు ఫోన్ పే చేశామని బాధితులు తెలిపారు.
రెవెన్యూ అధికారులు మాత్రం వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేస్తున్నారే తప్ప అమలు చేయడం లేదని ముడుపు ఇస్తే అధికారులే బోర్లు వేయడానికి సహకరిస్తున్నారని పలువురు బాహాటంగానే చెబుతున్నారు.
విచ్చలవిడిగా బోరు బావులు తవ్వడంతో ఇప్పటికే కొన్ని చోట్ల చేసిన బోర్లు ఫెయిల్ అవుతున్నాయని, భూగర్భ జలాలు అడుగంటిపోతే భవిష్యత్తు తరాలకు నీటి ఎద్దడి ఏర్పడుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ బోర్లు వేయడానికి ముడుపులు తీసుకోని సహకరిస్తున్న అవినీతి అధికారులపై పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
స్పందించని అధికారులు
భూగర్భ జలాలు అడుగంటిపోతే భవిష్యత్తులో సాగు, తాగునీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, అనుమతులు లేని బోర్లను తక్షణమే తొలగించాలని మరియు ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుక్కునూరు వాసులు డిమాండ్ చేస్తున్నారు.




