Bhimavaram: భీమవరంలో మానవత్వం చాటుకున్న 'ఫిట్ జోన్' అధినేత దాసరి చందు!
Bhimavaram: భీమవరంలో 'ఫిట్ జోన్' అధినేత దాసరి చందు పక్షవాత బాధితునికి నిత్యావసరాలు, కంటి ఆపరేషన్‌కు ఆర్థిక సాయం అందించి సామాజిక సేవా గుణం చాటుకున్నారు.
Bhimavaram: భీమవరంలో మానవత్వం చాటుకున్న 'ఫిట్ జోన్' అధినేత దాసరి చందు!
Bhimavaram: సామాజిక సేవే లక్ష్యంగా ‘ఫిట్ జోన్’ అధినేత దాసరి చందు తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. లంకపేట నివాసి, 51 సంవత్సరాల సత్యనారాయణ గారు 'పేరసల్సిస్' (పక్షవాతం) వ్యాధితో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న దాసరి చందు, వారి కుటుంబానికి బాసటగా నిలిచారు. సత్యనారాయణ కుటుంబానికి రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశారు.
అలాగే, దుర్గాపురం వాస్తవ్యురాలు కరుణ దేవి గారి కంటి ఆపరేషన్ సహాయార్థం 'ఫిట్ జోన్ జిమ్' తరపున రూ. 10,000/- ఆర్థిక సాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా దాసరి చందు మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా తమ జిమ్ తరపున వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమాజంలో ఇబ్బందులు పడుతున్న తోటి వారికి ప్రతి ఒక్క యువకుడు తన శక్తిమేరకు సహాయం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కే.నాగేంద్ర, పి.అశోక్, కే.కనకరాజు, సీత రామరాజు (బాబీ), బి.బాబీ నాయుడు, వెంకటేష్, అఖిల్, విజయ్, రాజేష్, పండు, కుమార్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.




