Devarapalli: దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ వద్ద భారీ మంటలు: షాపులు దగ్ధం!

Devarapalli: హైవే జంక్షన్ వద్ద భారీ అగ్నిప్రమాదంలో పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మద్దిపాటి, బాధితులకు అండగా ఉంటామన్నారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM
Published on: 23 July 2026 1:38 PM IST
Devarapalli: దేవరపల్లి గ్రీన్ ఫీల్డ్ వద్ద భారీ మంటలు: షాపులు దగ్ధం!
X

స్వయంగా పరిశీలించారు. అగ్నికి ఆహుతైన దుకాణాలను పరిశీలించి, బాధిత వ్యాపారులతో మాట్లాడి ప్రమాదం ఎలా జరిగిందో, ఎంత మేరకు నష్టం సంభవించిందో అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా బాధితులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం మరియు తన వంతు సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తానని భరోసా కల్పించారు.

బాధితులకు తగిన న్యాయం జరిగేలా సంబంధిత అధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.

అగ్నిప్రమాదానికి గల కారణాలపై అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే సూచించారు.

ఎమ్మెల్యే పర్యటన సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

బాధితులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటిని సానుకూలంగా పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన హామీ ఇవ్వడంతో బాధితులకు కొంత ఊరట లభించింది.

అగ్నిప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలని స్థానికులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

PAMULA NAGENDRA BABU, GOPALAPURAM

Next Story