Gopavaram: మంత్రి లోకేష్ సార్.. నాకు న్యాయం చేయండి: రైతు కృష్ణారెడ్డి గోడు!
Gopavaram: గోపవరం మండలంలో భూ సమస్యపై రైతు కృష్ణారెడ్డి ఆవేదన. ఏడుసార్లు సర్వే చేసినా న్యాయం జరగలేదని ఆరోపణ.
Gopavaram: మంత్రి లోకేష్ సార్.. నాకు న్యాయం చేయండి: రైతు కృష్ణారెడ్డి గోడు!
Gopavaram: గోపవరం మండలం మడకలవారిపల్లెకు చెందిన రైతు కృష్ణారెడ్డి తన భూమి సమస్యపై ఆవేదన వ్యక్తం చేశారు. 1994 సోమశిల ముంపు బాధితులుగా ప్రభుత్వం ఇచ్చిన డీకేటీ పట్టా భూమిని కొందరు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. భూమికి సరైన హద్దులు చూపించాలని కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోలకు పలుమార్లు అర్జీలు ఇచ్చినా న్యాయం జరగలేదన్నారు. ఇప్పటివరకు ఏడుసార్లు సర్వే కోరినా అధికారులు తప్పుడు హద్దులు చూపిస్తున్నారని వాపోయారు. మంత్రి నారా లోకేష్ స్పందించి తనకు న్యాయం చేయాలని బాధిత రైతు విజ్ఞప్తి చేశారు.
Next Story




