Maruteru: మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి

Maruteru: పశ్చిమగోదావరి జిల్లా మారుటేరు ఆర్‌ఏఆర్‌ఎస్‌లో ఏరువాక పౌర్ణమి వేడుకలు. వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసి మొదటి దుక్కి ప్రారంభించిన శాస్త్రవేత్తలు.

E.ABRAHAM, ACHANTA
Published on: 30 Jun 2026 8:41 AM IST
Maruteru
X

Maruteru: మారుటేరు వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఘనంగా ఏరువాక పౌర్ణమి

మారుటేరు: 29 వ తేదీన మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఏరువాక పౌర్ణమి ఘనంగా నిర్వహించారు. ఈ పండుగ రైతుల ప్రధాన వ్యవసాయ పండుగలలో ఒకటి. ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ పౌర్ణమి రోజున, సాధారణంగా జూన్ నెలలో జరుపుకుంటారు.

వర్షాకాలం ప్రారంభమై, ఖరీఫ్ పంటల సాగుకు సిద్ధమయ్యే సమయంలో ఈ పండుగ వస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. "ఏరు" అంటే నాగలి లేదా దున్నే వ్యవసాయ పరికరం, "వాక" అంటే ప్రారంభం.

కాబట్టి "ఏరువాక" అంటే వ్యవసాయ పనుల ప్రారంభం అని అర్థం అని సహా పరిశోధనా సంచాలకులు డా.సి.హెచ్.శ్రీనివాస్ తెలియజేశారు. పండుగ సాంప్రదాయం లో భాగంగా రైతులు తమ ఎద్దులు, నాగలి, వ్యవసాయ పరికరాలను శుభ్రపరచి అలంకరిస్తారు.

ఎద్దులకు పసుపు, కుంకుమ పెట్టి, పూలదండలు వేసి ప్రత్యేక పూజలు చేస్తారు. భూమాతకు, వర్షదేవునికి ప్రార్థనలు చేసి మంచి వర్షాలు, సమృద్ధిగా పంటలు పండాలని కోరుకుంటారు. పూజల అనంతరం రైతులు పొలంలో మొదటి దుక్కి (మొదటి దున్నకం) ప్రారంభించడం ఆనవాయితీ అని ఆయన తెలిపారు.

ఏరువాక పౌర్ణమి రైతులకు కొత్త వ్యవసాయ సంవత్సరానికి నాంది కనుక ఈ సంవత్సరం వానలు బాగా కురిసి పంటలు బాగా పండాలని రైతులకు మంచి లాభాలు రావాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమం లో శాస్త్రవేత్తలు, భోదనేతర సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం లో భాగంగా వ్యవసాయ పనిముట్లకు పూజలు చేసిన వ్యవసాయ క్షేత్రంలో దుక్కిలు చేయడం ప్రారంభించారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story