Eluru: ఉపాధి అక్రమాలపై సస్పెన్షన్ సరే రూ. 30 లక్షల రికవరీ మాటేంటి!
Eluru: మిట్టగూడెంలో రూ. 30 లక్షల ఉపాధి హామీ నిధుల నివేదికపై సిబ్బందిని సస్పెండ్ చేయడమే కాక, నిధులు రికవరీ చేసి కేసులు పెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Eluru: ఉపాధి అక్రమాలపై సస్పెన్షన్ సరే రూ. 30 లక్షల రికవరీ మాటేంటి!
Eluru: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలోని తొండిపాక పంచాయితీ మిట్టగూడెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో జరిగిన అక్రమాలపై, అధికారులు గ్రామానికి వచ్చి విచారణ నిర్వహించారు.
విచారణ సందర్భంగా ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్, మెట్లు మిట్టగూడెం గ్రామ శివారులోని మండవ రామిరెడ్డి చెరువు, కిసరి బాబురావు చెరువు,తీగల కుంట చెరువుల్లో మూడు, నాలుగు ఉపాధి కూలీల గ్రూపులు 4 - 5 వారాలు పనులు చేయకుండా ఫోటోలు, వీడియోలు తీసి కూలీల పేర్లపై తప్పుడు హాజరులు నమోదు చేసి సుమారు 30 లక్షలు వేతన నిధులు మంజూరు చేయించారని, కొందరు వ్యక్తులు భద్రాచలం, కొత్తగూడెం, హైదరాబాద్ పట్టణాల్లో ఉంటున్న వాళ్ళ పేర్లను ఉపాధి పనులు చేసినట్లుగా చూపి ఫోటోలు, వీడియోలతో నకిలీ హాజరు నమోదు చేసి వారి ఖాతాల్లో వేతనాలు జమ కావడంతో ఆ వేతనాల్లో సగం తీసి తమకు ఇవ్వాలని మెట్లు చెప్పడంతో సగం వేతనం మెట్లకు ఇచ్చినట్లు కూలీలు చెబుతున్నారు.
పనులు చేయకుండా ఫోటోలు, వీడియోలు తీసి తప్పుడు హాజరులు నమోదు చేసి,వేతనాలు పొందిన విషయాన్ని కూలీలే స్వయంగా విచారణకు వచ్చిన అధికారులకు చెప్పడంతో, ఉపాధి హామీ పథకంలో అవినీతికి పాల్పడిన సిబ్బందిపై కేవలం సస్పెన్షన్ వేటు వేసి చేతులు దులుపుకుంటున్నారే తప్ప, స్వాహా చేసిన ప్రభుత్వ నిధులను మాత్రం పూర్తిగా రికవరీ చేయడం లేదనే విమర్శలు బలంగా ఉన్నాయి.
విచారణలో అక్రమాలు నిజమని తేలినా, బాధ్యుల నుంచి నష్టపరిహారం రాబట్టడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన స్థానిక మేట్లు,టెక్నికల్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్లు లేదా కింది స్థాయి సిబ్బందికి రాజకీయ నాయకుల అండదండలు ఉండటం అక్రమంగా పొందిన సొత్తును రికవరీ చేయడానికి అధికారులు వెనకడుగు వేస్తున్నారని విమర్శలు లేకపోలేదు. అధికారుల ఉదాసీనతతో విచారణ చేసి సస్పెండ్ చేసినా తర్వాత రికవరీ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారే తప్ప బాధ్యులైన ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్, మెట్లు రికవరీ.
డబ్బు కట్టని పక్షంలో క్రిమినల్ కేసులు నమోదు చేసి ఉపాధిలో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తులను జప్తు చేసిన ప్రభుత్వాన్ని మోసం చేసి అక్రమంగా పొందిన ఉపాధి వేతన సొమ్మును రికవరీ చేయాలని పలువురు సూచిస్తున్నారు. ఉపాధి హామీలో 30 లక్షల పైనే అవినీతి జరిగిందని తేలినప్పటికీ ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, మెట్లపై మాత్రమే సస్పెన్షన్/శాఖాపరమైన చర్యలు తీసుకోవడం పట్ల ప్రజల్లో తీవ్రమైన సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధి పనులు చేయకుండానే పనులు చేసినట్టుగా తప్పుడు హాజరులు నమోదు చేసి 30 లక్షల పైనే అవినీతి జరిగిందంటే ఆ పని ప్రదేశాలను ఏపీఓ తనిఖీ చెయ్యకపోవడం ఏంటని, పని ప్రదేశాలను ఒకవేళ తనిఖీ చేస్తే ఇదంతా ఏపీవో కనుసన్నంలోనే జరిగిందనే విమర్శలు లేకపోలేదు. ప్రతి ఏటా ఉపాధి హామీ పనులకు సంబంధించి సామాజిక తనిఖీ బృందాలు నెల రోజుల పాటు తనిఖీలు చేసి, పనులు పరిశీలించి, ఆ పనుల్లో జరిగిన అవకతవకలపై బహిరంగ చర్చా వేదికలో చదివి వినిపించారు.
పనులు చేయకుండా బిల్లులు కాజేసిన వారు, సక్రమంగా పనులు చేయని వారికి అధికారులు రికవరీలు, పెనాల్టీలు రాస్తున్నారు. ఆ మొత్తాన్నంతా వారం లోపు చెల్లించాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటమని హెచ్చరిస్తున్నారే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటివరకు రికవరీ చేసిన సొమ్మెంత.
2015 - 2025 వరకు ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కుక్కునూరు మండలంలోని 15 పంచాయితీల్లో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవకతవకలపై ఎంత సొమ్మును రికవరీ చేశారు, ఎంతమంది సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకున్నారు. చర్యలు తీసుకున్న సిబ్బంది స్థానంలో ఎవరికి ఉపాధి కల్పించారు పూర్తి విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, ఉపాధి హామీలు అక్రమాలకు పాల్పడిన సిబ్బంది తొలగించి వారి స్థానంలో వారి బంధువులనే నియమించడంతో అక్రమాల దందా మూడు పూలు ఆరు కాయలుగా సాగుతుందని.
పలువురు బాహాటంగానే చెబుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారి బంధువులకే మరల ఆస్థానం కల్పించడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ఉపాధి హామీ పనుల్లో అక్రమాలకు పాల్పడిన వారిని తొలగించి వారి స్థానంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.




