Penumantra: పేదలపై మోయలేని భారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం ఆగ్రహం!
Penumantra: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు సెంటర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
Penumantra: పేదలపై మోయలేని భారం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సీపీఎం ఆగ్రహం!
పెనుమంట్ర: సామాన్య ప్రజలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిత్యవసరం వస్తువులు ధరలు పెంచుతూ ప్రజలను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ ఏ రవి మార్టేరు సెంటర్ లో నిత్యవసర వస్తువుల ధరల పెంపుదలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కాకిల్ని కొట్టి గెద్దలకు పెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్న అని అన్నారు.
పంచదార ధర30 నుంచి 70 రూపాయలకు. బియ్యం ధర ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయని ప్రభుత్వ విధానాలను ద్వియబట్టారు మరోపక్క ఎరువుల ధరలు పెంచుతూ వ్యవసాయం పండించే రైతుకు గిట్టుబాటు ధర లేకుండా కేంద్ర ప్రభుత్వం విధాలు ఉన్నాయని ఆయన అన్నారు ప్రజలందరూ స్వచ్ఛందంగా ధరలు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం రోడ్లపైకి రావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతా గోపాలన్.
సందర్భంగా మాట్లాడుతూ. ప్రభుత్వాలు ధరలు అదుపు చేయాలని ప్రజలు మోయలేని భారాల కారణంగా . తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని గోపాలన్ అన్నారు. తక్షణమే ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ వెంకటేశ్వరరావు . ది విజయ్ కుమార్. కాకర వెంకటేశ్వరరావు. పిల్లి ప్రసాద్. పి మోహన్ గంగరావు. మోజేష్. బొమ్మిడి ప్రభుదాస్. జి రంగారావు . నేదునూరు హనుమంతు సిరా విగ్నేశ్వర రావు . త్రిమూర్తులు . తదితరులు పాల్గొన్నారు.




