Tanuku: సెప్టెంబర్ 1న 'ఛలో ఢిల్లీ'ని విజయవంతం చేయాలి.. సీపీఐ పిలుపు!

Tanuku: కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ చేపడుతున్న దేశవ్యాప్త పాదయాత్రలు, 'ఛలో ఢిల్లీ'.

Kallem Murali, Tanuku (West godavari dist)
Updated on: 5 Aug 2026 2:15 PM IST
Tanuku
X

Tanuku: సెప్టెంబర్ 1న 'ఛలో ఢిల్లీ'ని విజయవంతం చేయాలి: సీపీఐ పిలుపు!

తణుకు: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరిచేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) దేశవ్యాప్తంగా చేపడుతున్న పాదయాత్రలను పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న నిర్వహించే 'ఛలో ఢిల్లీ' కార్యక్రమానికి జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

తణుకులోని కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవన్లో బుధవారం పాదయాత్రలు, ఛలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలపై పెరుగుతున్న ధరల భారం, నిరుద్యోగం, రైతు-కార్మిక వర్గాల సంక్షోభం, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా ప్రజలను సమీకరించేందుకు ఈ పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఆగస్టు 6, 7 తేదీల్లో భీమవరం, ఆగస్టు 8న ఉండి, ఆగస్టు 9న తాడేపల్లిగూడెం, ఆగస్టు 10న తణుకు, ఆగస్టు 11న పెనుగొండ, పాలకొల్లు, ఆగస్టు 12న నరసాపురంలో పాదయాత్రలు నిర్వహిస్తామని చెప్పారు. ఆగస్టు 13న ఉదయం 8 గంటలకు భీమవరం నుంచి yప్రారంభమయ్యే జిల్లా వ్యాప్త జీపు జాతా ఉండి, గణపవరం, పెంటపాడు, తాడేపల్లిగూడెం, తణుకు, ఇరగవరం, పెనుగొండ, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుకుని ముగుస్తుందని వివరించారు.

ఆగస్టు 17 నుంచి 28 వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగే ప్రచార ఉద్యమాలను విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న ఢిల్లీలో జరిగే 'ఛలో ఢిల్లీ' కార్యక్రమంలో జిల్లా నుంచి అధిక సంఖ్యలో రైతులు, కార్మికులు, మహిళలు, యువజనులు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొనేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బొద్దాని నాగరాజు, సికిలే పుష్పకుమారి, కలిశెట్టి వెంకట్రావు,ఎం. సీతారాం ప్రసాద్,మండల నాగేశ్వరావు,సనపల శ్రీనివాస్ పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story