VR Puram: సీపీఎం నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి వేడుకలు!

VR Puram: పోలవరం జిల్లా విలీన మండలాల్లో సీపీఎం నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి వేడుకలు.. ఘనంగా నివాళులర్పించిన నాయకులు.

RAJESH REDDY, CHINTOOR
Updated on: 12 Sept 2026 1:36 PM IST
VR Puram
X

VR Puram: సీపీఎం నేత కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతి వేడుకలు!

VR Puram: విలీన మండలాలైన చింతూరు విఆర్ పురం కూనవరం ఏటపాక మండలాల్లో సిపిఎం నేత అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండో వర్ధంతిని సిపిఎం నాయకులు ఘనంగా జరుపుకున్నారు.

ఏచూరి చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు సున్నం రాజులు, పల్లపు వెంకట్, సీసం సురేష్ లు మాట్లాడుతూ అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి పార్టీకి చేసిన సేవలు మరువలేనివి అని కొనియాడారు. ఏచూరి పార్టీ అభ్యున్నతికి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఏచూరి లాంటి మహనీయుడి సారధ్యంలో సిపిఎం పార్టీకి సేవ చేయడం తమ భాగ్యమని అన్నారు

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR